గద్దర్ మరణాన్ని తెలుగు జనులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల పుణ్యాన గద్దర్ గళం ఇంకా ఇంటింటా వినబడుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గద్దర్ యేభయ్యేళ్ల ప్రస్థానం మీద, గద్దర్ ప్రభావం మీద పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గద్దర్‌ని బోనులో నిలబెట్టి కొందరు తీర్పులు చెప్పేస్తుంటే, కొందరు గద్దర్‌ని విమర్శకు అతీతుడిగా వాదిస్తున్నారు. ఇలాంటి వాదనలు గద్దర్ బతికున్నపుడు జరిగేయి గానీ ఈ స్థాయిలో మాత్రం కాదు. ఎందుకంటే గద్దర్ బతికున్నపుడు అలాంటి చర్చలు తనవరకు వస్తే చాలా ధీటుగా సమాచారం చెప్పేవాడు కాబట్టి.
అవును, ఆయన కంఠ స్వరానికి విమర్శలు సైతం వణికేవి. ఆయన పాటలే కాదు… మాటలు కూడా చాలా నిక్కచ్చిగా, స్పష్టంగా, సూటిగా, వాడివేడిగా ఉండేవి. ఓ వర్గం మీడియా అయితే ఆయనను ఎల్లపుడూ తగ్గించే విధంగానే మాట్లాడుతూ పబ్బం గడుపుకొనేది. మరీ ముఖ్యంగా వారి ఫామిలీ విషయంలో. గద్దర్ ఇక్కడ అడ్డంగా కూడబెట్టిన సొమ్ముతో ఆయన కొడుకు సూర్యుడు, కూతురు వెన్నెలలు విదేశాల్లో తిరుగులేకుండా బతుకుతున్నారని లేనిపోని రాతలు రాస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసేవి. అసలు విషయం అయితే ప్రజలకైతే తెలుసుగాని, వారిమీద అంతగా అవగాహనలేని కొంతమంది ఆ మాటలు నమ్మేవారు.
అయితే అలాంటి వార్తలన్నీ అవాస్తవాలేనని తెలుసుకోవడానికి ప్రజలను ఎంతోకాలం పట్టలేదు. మొన్నటికి మొన్న కూడా గద్దర్ వారసులు మీడియా ముందుకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడిన ఉండటాన్ని మనం చూసాము. గద్దర్ ప్రజల మనిషి. ప్రజలలోంచి వచ్చిన మనిషి. కాబట్టే ఆయన ప్రజలకు అత్యంత చేరువకాగలిగాడు. ఇటు సామాన్యులనుండి సినిమా ప్రముఖుల వరకు ఆయనంటే పడిచచ్చేవారే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ కోవకే చెందుతారు. గద్దర్ ఆరోగ్యం విషమించిన తరువాత పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి విదితమే.
ఇక ఆయన మరణం అనంతరం, అంత్యక్రియల తరువాత తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గద్దర్ ఇంటికి వెళ్లి… తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గద్దర్ కొడుకు, కూతురు వెన్నెలను మహేష్ ఓదార్చినట్టు భోగట్టా. ఆయన మరణం తరువాత ఆయన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న మహేష్ బాబు మరోసారి తన ఉదారాన్ని చాటుకున్నట్టు తెలుస్తోంది. వారికి సాయంగా దాదాపు మూడు కోట్ల రూపాయిల చెక్ ని అందజేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక కళాకారుడికి చేసిన సాయం కాదది… ఆయనకు దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు.