తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 12 లక్షల ప్యాకేజీతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్!

నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ అందించేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాయి. ఈ ఉద్యోగాలలో చేరిన వారికి సంవత్సరానికి రూ.12 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేయడం విశేషం. భారత ప్రభుత్వానికి చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 45 పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడానికి రెడీ అయింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించిన ఈ సంస్థలో చేరాలనుకునే అభ్యర్థులకు నెల నెలా రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు శాలరీ అందుతుంది.

అధికారిక ప్రకటన ప్రకారం, ఈ 45 జాబ్‌లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, JM (పబ్లిక్ రిలేషన్స్)తో సహా వివిధ స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి. BDL రిక్రూట్‌మెంట్ 2023లో జాబ్ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. 2023, ఆగస్టు 21 నుంచి 2023, సెప్టెంబర్ 20 వరకు తెరిచి ఉండే అప్లికేషన్ విండో ద్వారా BDL జాబులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

BDL రిక్రూట్‌మెంట్ 2023 కోసం విద్యా అర్హతలు తెలుసుకుంటే.. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5-ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఫస్ట్ క్లాస్ M.Sc, 2-ఇయర్ MBAలో ఫస్ట్ క్లాస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, లేదా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లాలో డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ప్రతి పోస్ట్ కోసం నిర్దిష్ట విద్యా అవసరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

BDL మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన ఏజ్ తెలుసుకుంటే.. మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, JM (పబ్లిక్ రిలేషన్స్) స్థానాల్లో ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు దరఖాస్తు చేసిన పోస్ట్‌ను బట్టి 27/28 ఏళ్లు మించి ఉండకూడదు.

BDL MT రిక్రూట్‌మెంట్ 2023 ఎలక్షన్ ప్రాసెస్ ఈజీ గానే ఉంటుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు జాబు పొందేందుకు రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక వెల్ఫేర్ ఆఫీసర్, JM పోస్టులకు అప్లై చేసుకునేవారు రాత పరీక్ష పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు రూ. 500 ఉంటుంది మిగతా SC/ST/PwD/Ex-SM/అంతర్గత శాశ్వత ఉద్యోగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ లింకు https://drive.google.com/file/d/1reWLuJy730IUus5vb4tS73BIv6fgfTpn/view పై క్లిక్ చేయడం ద్వారా అధికారిక నోటిఫికేషన్ యాక్సెస్ చేయవచ్చు.