Pathan: హిట్ కొట్టి 9 ఏళ్ళు.. ఇవేం బుకింగ్స్ సామి అసలు.. మైండ్ బ్లాంక్.!!

Pathan: రాజు ఎక్కడున్నా రాజే అని ఊరికే అనలేదు. నాలుగేళ్లుగా సినిమాలు చేయట్లేదు.. దానికి తోడు అంతకు ముందు చేసిన మూడు సినిమాలు డిజాస్టర్స్.. అయినా కూడా షారుక్ ఖాన్ పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది..!

Sharukh Khan Pathan movie advance booking business create records
Sharukh Khan Pathan movie advance booking business create records

ప్రస్తుతం బాలీవుడ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. మరోవైపు బాయ్ కాట్ ట్రెండ్..  అయినా కానీ షారుఖ్ ఖాన్ జోరు తగ్గలేదు.. అడ్వాన్స్ బుకింగ్ షోలలో దుమ్ము దులిపేస్తున్నాడు.  నాలుగేళ్ళ తర్వాత షారుక్ నటించిన లేటెస్ట్ చిత్రం పఠాన్..

 

2018లో వచ్చిన షారుక్ జీరో సినిమాతో డిజాస్టర్ గా నిలిచింది..  మళ్ళీ ఇప్పుడు  2023లో 3 సినిమాలతో రాబోతున్నారు. జనవరి 25న సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ విడుదల కానుంది. దీని అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 14 కోట్లు దాటిపోయాయి. కొన్ని చోట్ల కేజియఫ్ 2 రికార్డుల్ని నేలమట్టం చేశాడు పఠాన్. షారుఖ్ ఖాన్  దూకుడుకు చూస్తుంటే మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి.

 

పఠాన్ టికెట్ రేట్స్ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఢిల్లీలో కొన్ని మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ 2100 రూపాయలుంటే.. ముంబైలో 1450.. బెంగళూరులో 800.. కోల్‌కత్తాలో 700 రూపాయల వరకు ఉన్నాయి. అక్కడ మినిమమ్ టికెట్ 300 నుంచి మొదలవుతుంది. అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ ఏకంగా 16 కోట్ల మార్కును దాటేసింది. అందులో ఒక్క నైజం ఏరియాలో పటాన్ సినిమా రెండు కోట్ల దాకా బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇండియాలో కోవిడ్ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేది రేంజ్ లో బుకింగ్ తో బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్న వాళ్ళకి.. మైండ్ బ్లాంక్ చేస్తూ దూసుకుపోతున్న పఠాన్ ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దుమారం చేస్తున్నాడని చెప్పాలి.