Kanthara 2: PAN ఇండియా కాంతార 2 లో — నందమూరి బాలకృష్ణ !!?

Kanthara 2: కోలీవుడ్ సినిమా గురించి మాట్లాడుకునే లాగా చేసిన మరో సినిమా కాంతార.. స్మాల్ బడ్జెట్ తో తెర మీదకి వచ్చిన ఈ సినిమా నాలుగు రెట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుంది.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన చిత్రం కాంతారా.. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇక ఈ సినిమా సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని రిషబ్ శెట్టి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా కాంతార2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Balakrishna acting on  Rishab Shetty Kanthara 2 movie
Balakrishna acting on
Rishab Shetty Kanthara 2 movie

చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సినిమాకు పార్ట్-2 రాబోతుంది.. సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.. రెండో భాగంలో హీరో తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటు వెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం డైరెక్టర్ హీరో అయినా రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లారట. కాంతార పార్ట్ 2 ను 2024 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు..

 

కాంతార పార్ట్ 2 లో నందమూరి నరసింహ బాలకృష్ణ నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ హీరో క్యారెక్టర్ కు తగ్గయినా పాత్రలో చేయనున్నారని.. లేదంటే ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే బాలయ్య తో  రిషబ్ శెట్టి ఈ విషయం గురించి మాట్లాడారని బాలయ్య కూడా ఈ సినిమాలో నటించడానికి సుముఖతగా ఉన్నారని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య మరోసారి తన మార్కులు చూపించారు .ఇదే రేంజ్ లో బాలయ్య కాంతారావు కూడా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రానిందని తెలుస్తోంది.

 

ఇదే నిజమైతే బాగుండని బాలయ్య ఫ్యాన్స్ తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు .ప్రస్తుతం మల్టీ స్టార్ ట్రెండ్ తో పాటు టాలీవుడ్ లో వారు బాలీవుడ్ లో బాలీవుడ్ వారు టాలీవుడ్ లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా కోలీవుడ్ స్టార్ తో కలిసి కాంతారావు నటిస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది..