School girls.. ఎన్నడూ లేని విధంగా మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఇరాన్ లో కొత్త తరం మహిళలు, బాలికలు గొంతు విప్పుతున్నారు. వారి తల్లిదండ్రులు, తాతలు అక్కడి వ్యవస్థను మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇకనైనా వికృతి చర్యలకు చరమగీతం పాడాలని భావిస్తున్నారు. భుర్కా ధరించకుండా ఇస్లాం సంప్రదాయాన్ని మంటగలిపారని ఆరోపిస్తూ కుర్దిష్ మహిళను నైతిక నియమావళి పోలీసులు అరెస్టు చేయడం.. కస్టడీలోనే ఆమె చనిపోవడంతో ఈ విషయం ఇప్పుడు భగ్గుమంది. ఇరాన్, ఆఫ్గాన్ వంటి ఇస్లామిక్ దేశాలలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ముఖ్యంగా స్కూల్ కి వెళ్తున్న బాలికలపై విషప్రయోగం జరుగుతున్న ఘటనలు ఇరాన్లో చోటు చేసుకున్నాయి.
ఈ విషయాన్ని సాక్షాత్తు ఇరాన్ మంత్రి వెల్లడించారు. పవిత్ర ఖోమ్ నగరంలోని కొందరు మహిళలను విద్యకు దూరం చేసే ప్రయత్నాల్లో భాగంగా స్కూల్ విద్యార్థినిలపై విష ప్రయోగానికి పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా టెహ్రాన్ కు దక్షిణంగా ఉన్న ఖోమ్ నగరంలోని ఎక్కువగా నమోదు కాగా వీరిలో కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బాలికలపై విష ప్రయోగాలు ఉద్దేశపూర్వకంగా జరిగినవే అని ఇరాన్ డిప్యూటీ యూనిట్ ఆదివారం పరోక్షంగా ధ్రువీకరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.