RK.Roja..టీడీపీ నేత నారా లోకేష్ ఇప్పుడు వైసీపీ నేతలకు రాజకీయంగా టార్గెట్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పడంతో దీనిపైన కొంతమంది వైసీపీ నేతలు లోకేష్ దేవ చేయడం జరిగింది. లోకేష్ పార్టీ నడపలేకనే జూనియర్ ఎన్టీఆర్ కి పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్కు అవకాశం ఇస్తే కొన్ని రోజులు టీడీపీ మనుగడలో ఉంటుందని వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని తదితరులు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా మంత్రి రోజా ఇదే అంశం పైన కూడా స్పందించింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తిరుపతిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన రోజా.. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి జగన్.. మంత్రులకు అప్పగించారని తెలియజేసింది. జగన్ తన మంత్రులను సొంత మనుషుల్లా చూస్తారని తెలియజేస్తోంది. చంద్రబాబు మాత్రం అలా చూడాలని తెలిపింది రోజా. ఎలాంటి వాటికైనా సిద్ధంగా ఉన్నామని లోకేష్ ది యువగలం కాదనీ.. గంగాలమంటూ రోజా వ్యాఖ్యానించింది. టిడిపిని ఎన్టీఆర్ దే అని తెలియజేసింది. ఇక పవన్ వారాహి ప్రజల్లోకి వస్తే ఎక్కడ హీరో అవుతారని భయంతోనే పవన్ పై విషం చిమ్ముతున్నారని రోజా సీరియస్ కామెంట్లు చేసింది. ఇక లోకేష్ పాదయాత్ర కూడా ఫెయిల్ అయిందని తెలుపుతోంది రోజా.