Sania : టెన్నిస్‌ కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సానియా.. ఇదే చివరి టోర్నీ అంటూ ఎమోషనల్..

Sania: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని ప్రకటించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసింది.

Sania Mirza retirement after Australia open emotional tweet
Sania Mirza retirement after Australia open emotional tweet

అందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి తెలిపింది. 30 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్‌ కోర్టుకు వెళ్లానని.. ఆరేళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందని.. ప్రతి సమయంలో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌, ఫిజియో, అంతా సపోర్ట్ చేశారని తెలిపింది. ప్రతి ఒక్కరితో తన కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెలిపింది. సానియా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్‌ స్లామ్‌లో ఆడనుంది. సానియా తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించింది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణి నిలిచింది. వరల్డ్‌ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది.