Adi: హైపర్ ఆది బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది గుర్తింపు తెచ్చుకున్నాడు.. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆమె కారణంగానే జబర్దస్త్ నుంచి హైపర్ ఆది తప్పుకున్నాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా సంక్రాంతి ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమోలో హైపర్ ఆది పెదరాయుడు సినిమా స్పూఫ్ తో ఒక స్కిట్ చేశాడు. స్కిట్ అయిపోయిన తర్వాత యాంకర్ రష్మీ ఆసక్తికర ప్రశ్న వేసింది.. స్క్రీన్ పై ముగ్గురు ఫోటోలను వేసి నువ్వు ఎవరి కారణంగా జబర్దస్త్ మానేశావో చెప్పమని అడిగింది. వీటినే ఆది సౌమ్య ఫోటో చూపిస్తాడు. దీంతో ఒక్కసారిగా స్టేజిపై ఉన్న ఇంద్రజ, రష్మీ షాక్ అవుతారు. కాకపోతే హైపర్ ఆది నిజంగానే సౌమ్య కారణంగా జబర్దస్త్ మానేశాడా..? లేక ఇదంతా కేవలం స్కిట్ లో భాగమా..? అన్నది పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సింది. ఇదంతా ప్రోమో హైప్ కోసం ఆది చేత ఇలా చేయించారా అనేది ఈ ఎపిసోడ్ రివిల్ అయ్యాక తెలుస్తుంది.