Walteru : మెగాస్టార్ వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.!?

Walteru: మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్ తో దూసుకెళ్లింది మెగాస్టార్ ఈ సినిమాలో వన్ మ్యాన్ మాస్ గా ముందుకు తీసుకెళ్లాడు.‌ వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేశాడంటే.!?

Megastar Walteru veeraya first day collections
Megastar Walteru veeraya first day collections

వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది. దీనికి తోడు మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒక్క నైజాం ఏరియానే కాదు.. అటు సీడెడ్, ఉత్తరాంధ్రలోను మంచి బుకింగ్స్ నమోదు అయ్యాయి. కాగా ఆచార్య, గాడ్ ఫాదర్‌లతో పోల్చితే వాల్తేరు వీరయ్యకు 18 నుంచి 19 కోట్ల రేంజ్‌‌లో షేర్ రావోచ్చని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక వీటికి ఓవర్సీస్ వసూళ్లు అదనం. మొత్తంగా కలుపుకొని వాల్తేరు వీరయ్య 25 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం ఇక ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్స్ కు దగ్గరలో ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ డే దుమ్ము దులిపే కలెక్షన్స్ వసూలు చేశారనే చెప్పొచ్చు.