Randeep : పండగ రోజు బ్యాడ్ న్యూస్ : ప్రముఖ నటుడికి అతిపెద్ద యాక్సిడెంట్ ఆసుపత్రి లో చావు బతుకుల మధ్య !

Randeep: బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా గుర్రపు స్వారీ చేస్తూ స్పృహతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రణదీప్ ను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో గాయపడిన నటుడు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు.

Bollywood Actor Ranadeep Hooda injured
Bollywood Actor Ranadeep Hooda injured

గత ఏడాది సల్మాన్ ఖాన్ తో రాధే సినిమా కోసం ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రణదీప్ గాయపడ్డాడు. అప్పుడే తన కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఇన్స్పెక్టర్ అవినాష్ సిరీస్ చిత్రీకరణ సమయంలో గాయపడడంతో ఈ శస్త్రచికిత్స జరిగింది. రణదీప్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నాడు. రణదీప్ సావర్కర్ తన సినిమా కోసం భారీగా బరువు తగ్గడు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ క్యాట్ ప్రమోషన్ల ఆ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు రణదీప్ కి ప్రశంసలు కూడా లభించాయి. తన డైట్ చాలా తక్కువ తీసుకుంటున్నాడు.

అదే ఈ కళ్లు తిరిగి పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. సావర్కర్ సెట్స్పైకి వచ్చిన వెంటనే వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రలో సరిపోయేలా అతను కఠినమైన మెయింటెయిన్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు.తన రోల్ కోసం 22 కిలోల బరువు తగ్గినందున.. అతని మోకాలి కాలుపై పెద్ద ప్రభావాన్ని చూపింది. రణదీప్ ఎడమ కాలికి శస్త్రచికిత్స అవసరం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.