Siddarth: హిమాచల్ ప్రదేశ్ కు ఆడుతున్న సిద్ధార్థ్ శర్మ రంజీల్లో భాగంగా జట్టుతో కలిసి గుజరాత్ వెళ్లాడు. కానీ ఆరోగ్యం పాడవడంతో గత రెండు వారాల నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ప్రాణాలతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. ఈ విషయన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ మరణం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమైన సిద్ధార్థ్ కొన్నాళ్ల క్రితం పలు అనారోగ్య సమస్యల ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకునేసరికి కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. కాగా మళ్లీ సీరియస్ కావడంతో గుజరాత్ వడోదరాలో ప్రాణాలు విడిచాడు. సిద్ధార్థ్ శర్మ 28 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయాడని తెలిసి తోటి ఆటగాళ్లతో పాటు మిగతా జట్ల క్రికెటర్లు షాకవుతున్నారు. 2017-18లో హిమాచల్ ప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. రంజీ టోర్నీలో 25 వికెట్లు తీశాడు. 2021-22లో విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడాడు. ఆరు మ్యాచుల్లో 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐదేళ్ల కాలంలో హిమాచల్ ప్రదేశ్స్ తరఫున ఓ టీ20, ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచులు చాలా మ్యాచులు ఆడాడు. 2022 డిసెంబరులో కోల్ కతా వేదికగా బెంగాల్ తో చివరి మ్యాచ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన సిద్ధార్థ్.. తర్వాత ఇన్నింగ్స్ లోనూ పలు వికెట్లు తీసి మెప్పించాడు.