Samantha : నేను చావ‌లేదు, బ్ర‌తికే ఉన్నా.. ఇంట‌ర్వ్యూలో ఎమోష‌న‌ల్ అయిన స‌మంత‌

Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంతకు ఇటీవ‌ల క‌ష్ట కాలం న‌డుస్తుంది. అన్ని అవ‌రోధాలే ఎదుర‌వుతున్నాయి. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత‌కు అనారోగ్య స‌మస్య‌లు త‌లెత్తాయి. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనారోగ్యంపై మాట్లాడిన సమంత భావోద్వేగానికి గురయింది. తాను న‌టించిన‌ యశోద ప్రమోషన్‌లో భాగంగా స్పందించిన స‌మంత‌.. ‘నేను నా పోస్టులో చెప్పినట్టుగా కొన్ని రోజులు మంచిగా ఉన్నాయి. కొన్ని రోజులు చెడుగా ఉన్నాయి.. ఒక్కొక్క రోజైతే ఇంకో అడుగు ముందుకు వేయలేయ‌నేమో అనిపిస్తోంది. కానీ కొన్నిసార్లు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చానా? అనిపిస్తుంది’’ అని సమంత ఓ ప్రశ్న‌కు స‌మాధానం ఇచ్చింది.

samantha-emotional-about-her-health
samantha-emotional-about-her-health

Samantha : v..

ఇక తాను మాట్లాడుతూ.. నేను ఒక్క దానినే కాదు. చాలా మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా ఆర్టికల్స్ చూశాను. లైఫ్-థ్రెటెనింగ్ అని రాసారు. ఇది ఇప్పుడు లైఫ్-థ్రెటెనింగ్ కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు, బ్ర‌తికే ఉన్నాను. అయితే ఇది కష్టంతో కూడుకున్న ప‌ని అయిన‌ప్పటికీ, దీనిపై పోరాటం చేయాలి’’ అని సమంత చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నారు.ఇక‌ ఆమెకు మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థన‌లు కూడా చేస్తున్నారు..

ఓవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. సమంత చిత్రంలో తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేసింది. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తుంది. అంతేకాదు త‌న‌కు సంబంధించిన చిత్రాలను సమంత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ సినిమాకి మంచి ప్ర‌మోష‌న్ వ‌చ్చేలా చేస్తుంది. ఇక సినిమా గురించి చెబుతూ.. యశోద సినిమా పర్‌ఫెక్ట్ థ్రిల్లర్ కాగా, ఇది చాలా ఫర్‌ఫెక్ట్‌గా వచ్చింది. అందుకే మాకు బాగా టెన్షన్ క‌లుగుతుంది. యశోద సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ చూసిన తర్వాత కాన్సెప్ట్‌ను అందరూ మెచ్చుకుంటారు అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.