Jabardasth : ఈ క‌మెడీయ‌న్ త‌ల్లి పాచి ప‌నులు చేసిందా.. అంత క‌ష్టం ఎందుకు వ‌చ్చింది..!

Jabardasth : తెర‌పై మ‌న‌కు వినోదం పంచే చాలా మంది క‌మెడీయ‌న్స్ జీవితంలో విషాద గాథ‌లు త‌ప్ప‌క ఉంటాయి. వారు ఈ స్థాయికి వ‌చ్చారంటే ఎన్నో క‌ష్టాల‌ని చ‌విచూసి ఉంటారు. అలాంటి వారిలో జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ శాంతి స్వ‌రూప్ ఒక‌రు. సన్నగా కనిపిస్తూ స్టేజ్ పై నవ్వుల సందడి చేసే శాంతిస్వరూప్ .. జబర్దస్త్ కి రాకముందు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉండేవారు అట‌. ఒకానొక సంద‌ర్భంలో మాట్లాడుతూ.. మా నాన్నకి అనారోగ్యం .మంచి మందులు వాడే పరిస్థితి లేదు.అన్నయ్యలు ఉన్నప్పటికీ వాళ్ల ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉనే ఉండేది”“మా నాన్న చనిపోయిన తరువాత నేను ఇంటికి వెళ్లాను. ఆ స‌మ‌యంలో 50 కూడా లేవు. హైదరాబాద్ లో తెలిసినతనికి ఫోన్ చేసి,మా ఊళ్లో తెలిసిన వారి ఎకౌంట్ నెంబర్ చెప్పి, 2000 వేయమని చెప్పాను. వాటితో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాను అని త‌న బాధ‌లు చెప్పుకున్నాడు.

jabardasth-comedian-mother-emotional
jabardasth-comedian-mother-emotional

Jabardasth :  క‌న్నీటి గాథ‌..

ఇక రీసెంట్ క్యాష్ షోకి వ‌చ్చిన శాంతి స్వరూప్ త‌న త‌ల్లి ప‌రిస్థితి కూడా చెప్పి అంద‌రు క‌న్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. క్యాష్ షోలో శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖ వారి వారి తండ్రులతో హాజరు కాగా, ఇక షోలో ఎప్పటిలాగానే సుమ తన మార్క్ యాంకరింగ్ తో ఆకట్టుకుంది. కానీ సాయిలేఖ, హరిత వాళ్ల నాన్నల కౌంటర్లకు సుమ దగ్గర సమాధానం కూడా లేకుండా పోయింది. ఇక శాంతి స్వరూప్ తన తల్లి పడ్డ కాష్టాల గురించి చెప్పుకుంటూ.. ఎమోషనల్ కి గుర‌య్యాడు. మా అమ్మ చాలా ఇళ్లలో పాచి పని చేసేదని, అప్పుడు ఆకలి విలువ అంటే ఏంటో.. మాకు తెలిసి వచ్చిందని భావోద్వేగానికి లొన‌య్యాడు.

మా అమ్మకు చిన్నతనం నుంచి గొంతు సరిగ్గా రాదని, స్పష్టంగా మాట్లాడలేదని.. ఏదో మాట్లాడాలనుకుటుంది కానీ మాట్లాడలేదు అని చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక ఇదే క్రమంలోనే శాంతి స్వరూప్ గురించి తల్లి సరోజనమ్మ మాట్లాడుతూ..”నా కొడుకే నన్ను ఇప్ప‌టికీ బతికిస్తున్నాడు. ఆస్పత్రుల చూట్టు తిప్పుతున్నాడు” అని కన్నీటి పర్యంతంకాగా, ప్రతి ఒక్క‌రి హృద‌యం క‌కా విక‌లం అయింది. ప్ర‌స్తుతం సుమ షోకి సంబంధించిన‌ప్రోమో వైర‌ల్ గా మారింది.