Vastu Tips : ఈ సంకేతాలు ఇంట్లో కనిపిస్తే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా గుర్తించండి!!

Vastu Tips : పాజిటివ్, నెగిటివ్ అనే రెండు ఎనర్జీల మధ్య బ్రతుకుతున్నాం.. పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట అంతా ప్రశాంతం గా సంతోషం గా ఉంటాము. అక్కడఉండేవారికి కూడా అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశంలో మనకు ఎక్కువ సేపు అక్కడే ఉండాలని అనిపిస్తుంది. అదేవిధం గా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశం లో కొద్దిసేపు ఉండడటం కూడా కష్టం గా అనిపిస్తుంది. ఏదో తెలియని వెలితి వెంటాడుతు ఉండడం వలన ప్రశాంతంగా ఉండలేకపోతాం. మన పనులు కూడా సరిగా జరగా జరగకుండా వాయిదా పడుతూ ఉంటాయి. అయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేసిచూడండి.

If these signs are present in the house, identify it as negative energy
If these signs are present in the house, identify it as negative energy

మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నాకూడా ఒక్కోసారి చెడువాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాసన వస్తుంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని గుర్తించాలి. ఆ దుర్వాసన లేకుండా చూసుకోవడం కోసం రోజులో కొద్దీ సేపు అయినా ఇంటి కిటికీలని ,తలుపులని తెరిచి పెట్టండి. ఇంట్లో తరచూ సాంబ్రాణి పొగ వేస్తూ ఉండండి.సమస్య తగ్గుతుంది.

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రతి విషయంలో వాదనలు,గొడవలు వస్తున్నాయి అంటే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం తో పాటు, అసుర సంధ్య వేళ అంటే సూర్యాస్తమయం అవడానికి ఒక అర గంట ముందు ఇంట్లో సాంబ్రాణి వేసి చేతి లోకి గంట ను తీసుకుని మోగిస్తూ ధూపాన్ని ప్రతి గదిలో వేయండి.

డబ్బు సమస్య అనేది చాలా కామన్ అలా కాకుండా డబ్బు సమస్యకు అంతేలేకుండా తీవ్రంగా ఇబ్బందికలుగుతుంటే,ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. రాత్రి పడుకున్నప్పుడు తరచుగా పీడ కలలు వస్తుంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్ధం. చెడు కలలు రాకుండా ఉండటానికి ఈ మంత్రాలను జపించవచ్చు.
దుర్గామాత మంత్రం:యా దేవీ సర్వ భూతేషు నిద్ర రూపేణ సంసితః నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని జపించుకోండి.

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన మనం ఎప్పుడు నెగిటివ్ గా నే ఆలోచిస్తాం ఇది ఒక సంకేతమే. బాగా పని చేసినప్పుడు నీరసంగా , ఓపికలేనట్లుఅనిపిస్తుంది. ఒక్కోసారి మనం చేసింది ఏమి లేకపోయినా నీరసంగా అలసటగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ కారణం. ప్రతి రోజు ఇంట్లో పూజ ,మంత్ర పఠనం లాంటివి చేసుకోవడం వలన సమస్య తగ్గుతుంది. ఇంకా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నిపుణులైన వారిని కలిసి సమస్య చెప్పి పరిష్కరం అడగండి.