సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి తాజాగా సారా టెండుల్కర్ వచ్చి సందడి చేసినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం హైదరాబాద్ వచ్చేసిన సారా మహేష్ బాబుని కలిసి కాసేపు అతనితో మాట్లాడాలని జూబ్లీహిల్స్ లోని అతడి నివాసానికి వచ్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సారా ఇటీవల సరిలేరు నీకెవ్వరు హిందీ డబ్ వెర్షన్ చూసిందట. అందులో మహేష్ బాబు నటన లుక్స్ బాగా నచ్చాయట. అప్పటినుంచి మహేష్ బాబు అతనికి ఫేవరెట్ హీరో అని ఇంట్లో చెబుతూ తిరుగుతూ ఉందట. అయితే రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక పని పడటంతో ఆమె భాగ్యనగరానికి వచ్చింది. మహేష్ ఇంటికి వెళ్లి అతనితో కాసేపు ముచ్చటించాలనే ఉద్దేశంతో అతని నుంచి ముందుగానే పర్మిషన్ తీసుకుంది.
నిజానికి మహేష్ కి సచిన్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా ట్వీట్స్ చేసి సచిన్ పై తనకి ఎంత ప్రేమ ఉందో తెలియజేశాడు. అలాంటిది అతని కూతురు తనకు అభిమానిగా మారటంతో ప్రిన్స్ సంతోషించాడట. అంతేకాదు ఆమె తనని కలవడానికి వస్తుందని తెలిసి మరింత ఖుషి అయ్యాడట. ఆమెకు హార్ట్ టచింగ్ రీతిలో స్వాగతం పలికాడట. ఇక మహేష్ కూతురు సితార కూడా సారా తో వెంటనే కలిసిపోయిందని, మురారి సినిమాలోని పాటలకు వీరిద్దరూ కలిసి స్టెప్పులు వేశారని తెలుస్తోంది.
ఇకపోతే పాతికేళ్ల ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. నటుడు సిద్ధార్థ్ కెర్కర్ తో కూడా ఆమెకు ఆ ఫైర్ ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. 2020లో, సారా, గిల్ కొన్ని ఈవెంట్‌లలో కలిసి కనిపించిన తర్వాత వారు డేటింగ్ చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే, ఈ పుకార్లను సారా లేదా గిల్ ధృవీకరించలేదు. 2021లో, సారా కూడా ఒక పార్టీలో కెర్కర్‌తో కనిపించింది. వారు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ పుకార్లు కూడా ఎప్పుడూ నిజం కాలేదు.