రూ.1,000 కోట్లతో ఘట్టమనేని ఫిలిం స్టూడియోస్ స్థాపించిన మహేష్ బాబు.. చీఫ్ గెస్ట్‌గా సీఎం జగన్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు యాడ్స్‌లో కూడా నటిస్తూ రెండు చేతులా చాలా డబ్బును సంపాదిస్తున్నాడు. వాటితో ఒక థియేటర్ కూడా కొనుగోలు చేశాడు. అంతేకాదు, చిన్నపిల్లల చికిత్సలకు డబ్బును విరాళంగా ఇస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రిన్స్ రూ.1,000 కోట్ల ఘట్టమనేని స్టూడియోని స్థాపించాడు. ఘట్టమనేని ఫిలిం స్టూడియోస్ అని పిలిచే ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా విచ్చేయనున్నారు.

నిజానికి మహేష్ బాబుకు ఆల్రెడీ పద్మాలయ స్టూడియోస్ ఉంది. అయినా క్రాఫ్ట్ పట్ల ఆయనకున్న ప్యాషన్, పరిశ్రమకు సహకరించాలనే కోరికతో దీన్ని అతడు కట్టించాడట. అలాగే ప్రతిభను ప్రోత్సహించడానికి, ఆకట్టుకునే కథలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి, చిరస్మరణీయ సినిమా అనుభవాలను సృష్టించడానికి ఘట్టమనేని స్టూడియోస్‌ను ఒక వేదికగా మహేష్ అందుబాటులోకి తీసుకొచ్చాడు.

ఘట్టమనేని స్టూడియోస్ అత్యాధునిక సౌండ్ స్టేజ్‌లు, అధునాతన పోస్ట్-ప్రొడక్షన్ యూనిట్లు, సాంకేతికంగా అధునాతన పరికరాలతో సహా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉందని సమాచారం. ఈ ప్రొడక్షన్ స్టూడియో ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి పనికి వన్ స్టాప్ డెస్టినేషన్ గా కూడా నిలుస్తుందని అంటున్నారు. హై క్వాలిటీ సినిమాలు తీయడానికి ఘట్టమనేని ఫిలిం స్టూడియోస్ కేరాఫ్ అడ్రస్ గా కూడా అవతరించనుందని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దీనికి సంబంధించి అధికారికంగా మహేష్ అలాంటి ప్రకటన చేయలేదు.

అయితే సోషల్ మీడియాలో ఈ స్టూడియోస్ కి సంబంధించిన వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ స్టూడియోస్ గురించి త్వరలోనే అందరికీ తెలిసే అవకాశం ఉంది.