Royal Enfield Bike : భారత దేశంలో చాలామంది ద్విచక్ర వాహన తయారీ మోడల్స్ లో ఎక్కువగా ఇష్టపడే వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పవచ్చు. ఇది బ్రాండ్ మాత్రమే కాదు నడిపే వ్యక్తికి కూడా హుందాతనాన్ని తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ లో ఎన్నో రకాల మోడల్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి . ఇక వీటి ధర ఎక్కువ అయినప్పటికీ కూడా కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన విషయం కూడా లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో చాలామంది ఒకరిని చూసి మరొకరు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే 2022 – 2023 సంవత్సరానికిగాను భారతదేశంలో లాంచ్ చేయబోతున్న బైకుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొత్త మోడల్ డిజైన్స్ , ఫీచర్లను వివరిస్తూ నివేదికలు కూడా బయటకు వచ్చాయి. బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఇప్పటికే భారతదేశంలోని వినియోగదారుల కోసం రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసింది.
ఇక ఈ క్రమంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తున్న సరికొత్త మోడల్స్ విషయానికి వస్తే హిమాలయన్ 450, మోటార్ 650 , క్లాసిక్ 650, హంటర్, షాట్ గన్ వంటి కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇకపోతే కొత్త మోడల్స్ లో హిమాలయన్ 450 పవర్ఫుల్ ఇంజన్తో అందుబాటులోకి వస్తుంది అన్నట్లుగా అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ అందుబాటులో ఉంది. ఇక ఈ కొత్త మోడల్ కు సూపర్ మోటార్ అనే పేరు కూడా పెట్టారు. ఇక ఇది మోటార్ సైకిల్ యొక్క పటిష్టమైన అప్గ్రేడ్ వెర్షన్ గా ఉండబోతున్న ట్లు సమాచారం. ఇకపోతే కొత్త మోటార్ సైకిల్ ఇంటర్ సెప్టర్ 650 లో వచ్చిన అదే ఇంజన్ తో ఈ మోటర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తున్నట్లు సమాచారం. ఇక అయితే ఇంజన్ ట్యూనింగ్ లు ఎలా ఉంటాయి అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మోటార్ 650 , 2019 లో వెల్లడించిన కె ఎక్స్ కాన్సెప్ట్ లోని డిజైన్ ను కూడా ఇది పోలి ఉంటుంది అని చెబుతున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 : ఇకపోతే ఈ బైక్ యొక్క డిజైన్ వివరాలను తెలియజేసే కొన్ని నివేదికలు కూడా బయటకు వచ్చాయి. బైక్ లో రౌండ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నట్లు సమాచారం ఇక స్ప్లిట్ డిటాచబుల్ పిలియన్ యూనిట్ , రౌండ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ , 649 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ వంటి ఫీచర్లు ఈ కొత్త మోడల్ లో అందించనున్నట్లు సమాచారం.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ : ఇక ఈ సరికొత్త మోడల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్న బైక్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక ఈ బైకు లో కూడా రౌండ్ హెడ్ల్యాంప్స్ లతోపాటు.. డిస్క్ బ్రేక్ అలాగే అల్లాయ్ వీల్స్ తో వస్తుందని సమాచారం.. ఇక ఈ బైక్ క్లాసిక్ 350, మోటార్ 350 లో వున్న హెచ్ సి లేఅవుట్ తో..349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ తో త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 : ఇక ఈ సరికొత్త వర్షన్ త్వరలోనే లాంచ్ కు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ మోడల్ లాంచ్ అవడానికి ముందు ఇండియా రోడ్లపై బైకును పరీక్షించుకోనున్నారు ఇక టెస్ట్లో పాస్ అయితేనే ఈ బైక్ను ఇండియాలో విడుదల చేస్తామని కూడా సంస్థ ప్రకటించింది. ఇక ఈ బైక్ అప్డేటెడ్ 450 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను తో వస్తుంది. ఇక ప్రస్తుతం పవర్ ఫిగర్స్ వివరాలు అయితే అందుబాటులో లేవు.. కానీ 40 hp, 45Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అని సమాచారం. ఇక ఇందులో లో మూడు రైడ్ మోడ్ లు రెండు పెద్ద చక్రాలతో ఉండే అవకాశం ఉందని సమాచారం.