Audi : ఆడి నుంచి సరికొత్తగా ఈ-రిక్షా.. ఉద్దేశం తెలిస్తే షాక్..!!

Audi : జర్మనీ ప్రాంతానికి చెందిన లగ్జరీ వాహనాల బ్రాండ్ అయిన ఆడి భారత దేశంలో తాజాగా E -రిక్షా లను విడుదల చేయనుంది. జర్మనీ , ఇండియా లో స్టార్ట్ అప్ అయిన నునామ్ తో కలిసి ఈ ప్రయత్నం చేయబోతోంది. ఆడి వాహనాలలో పరీక్షించ డానికి ఉపయోగించే బ్యాటరీలను ఇందులో ఉపయోగించబడుతున్నది. ఎక్కువ వోల్టేజి ఉన్న బ్యాటరీలు తిరిగి ఉపయోగించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం . అంటే బ్యాటరీలకు రెండో లైఫ్ ఇవ్వడం వంటిది లాంటిది అన్నమాట. ఆడి ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బ్యాటరీలను పునర్జీవనం కల్పించడం జరుగుతుందట. ఇక ఈ బ్యాటరీ లను E- రిక్షాల లో అమర్చడం జరుగుతోందట. ఇలాంటి వాటిలో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించడం జరుగుతోంది. ఆడి ఏజీ, ఆడి ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, నునామ్ కలిసి తీసుకు వస్తున్న ఈ మొదటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూపొందించే ఆడి E- రిక్షాల ను భారతదేశంలో విడుదల చేయనున్నది.

Advertisement

వీటిని 2023 ప్రారంభంలో తొలి పైలెట్ ప్రాజెక్టు కింద E- రిక్షాలను విడుదల చేయబోతున్నారు. వీటిని నాన్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కింద అందించనుంది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే వస్తువులు అమ్మేందుకు మహిళలకు ఈ ఎలక్ట్రిక్ ఈ- రిక్షాలను కూడా ఉపయోగించుకోవచ్చట. బ్యాటరీలు పాతవే అయినా కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని.. వాటిని రెండింటిని ఉపయోగించి అందజేయడం జరుగుతుంది అని నునామ్ కో ఫౌండర్ ప్రదీప్ తెలియజేశారు. వీటి వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మహిళలకు అండగా నిలవడం వంటి లక్ష్యాలతో చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి..E రిక్షాలు కమర్షియల్ గా మార్కెట్లోకి తీసుకు వచ్చే అవకాశం లేదు.. వీటి ధర వివరాలు కూడా ఇంకా తెలియలేదు. వీటిలో మొదట కేవలం స్వచ్ఛంద సంస్థలకు అందించే విధంగా వీటిని రూపొందించడం జరుగుతోంది. ఆడి E- రిక్షాలు మొదట ఎలక్ట్రిసిటీ తో ఛార్జ్ చేయబడతాయి.. ఆ తర్వాత సోలార్ చార్జింగ్ వంటి స్టేషన్లలో కూడా వీటిని ఛార్జ్ చేసే విధంగా తయారు చేయడం జరుగుతోందట.

Advertisement
Audi e-rickshaw may soon be spotted on Indian roads
Audi e-rickshaw may soon be spotted on Indian roads

ప్రస్తుతం ఈ టైపు మాత్రమే తయారవుతున్నాయని ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇందులో పలు మార్పులు కూడా ఉంటాయని ఈ సంస్థ తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా మహిళలకు కూడా స్వయం ఉపాధి కల్పించే విధంగా వీటిని తయారు చేసి త్వరలోనే వీటిని అందరికీ అందుబాటులో చేసే విధంగా కూడా ఉండబోతున్నాయని ఈ సంస్థ అధినేతలు తెలియజేయడం జరిగింది. అయితే వీటిని భారతీయ రోడ్లపై చూడాలి అంటే మరి కొన్ని నెలల సమయం పడుతుందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఈ ఆడి ఈ- రిక్షాలు ఎంతో తేలికగా ఉండడమే కాకుండా నడపడానికి చాలా సులువుగా ఉంటుంది. సాధారణ ఆటో ల కంటే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.

ఇక వీటి పై మహిళలకు రాయితీ కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. చూడడానికి ఆటో లాగా కనిపించే ఈ ఈ- రిక్షాలు ఎంతోమందికి ఉపాధి కరంగా మారనున్నాయి. ఇకపోతే ఆడవారికి స్వయం ఉపాధి కల్పించడం కోసమే ఇలా సరికొత్త గా వీటిని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఆడవారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా వాళ్ళ కాళ్లపై వారు నిలబడేలా స్థాయికి తీసుకు రావడమే ధ్యేయంగా ఇలాంటి రిక్షాలను కనుగొన్నామని సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఆడి చేసిన ఇలాంటి వినూత్నమైన పనికి ప్రతి ఒక్కరూ తెచ్చుకోవడమే కాకుండా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

Advertisement