Business Idea : రిస్క్ లేకుండా లక్షల్లో ఆదాయం.. ఎలా అంటే..?

Business Idea : కరోనా సమయంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాదు అప్పుడు కలిగిన ఆర్థిక నష్టం ఇప్పటికీ తీర్చుకోలేక రకరకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా చాలా మంది నిరుద్యోగులు గా మారి తినడానికి కూడా తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక బయటకు వెళితే మహమ్మారి ఎక్కడ అటాక్ చేస్తుందో అనే భయంతో తిండి గింజల తెచ్చుకోవడానికి కూడా సాహసం చేయలేక పోతూ ఉండడం గమనార్హం. ఇక డబ్బు లేక .. బయటకు వెళ్లలేక.. ఏదైనా పని చేయలేక ఇలా ఎన్నో రకాలుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా డబ్బు కావాలని అందుకోసం ఏ పని చేయడానికైనా సరే ఎవరూ వెనుకాడడం లేదు. అయితే రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం. మరి అలాంటప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వ్యవసాయం చేయడమే ఉత్తమమైన పద్ధతి అని చెప్పవచ్చు.

అయితే చాలామంది వ్యవసాయంలో వచ్చే నూతన పద్ధతులను అవలంబిస్తూ ఎక్కువ లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వ్యవసాయంలో కేవలం 4 లేదా 6 నెలలు పూర్తయితే లక్షల్లో లాభాలు వస్తుంటాయి. కానీ ఒకసారి వదిలేస్తే జీవితాంతం ఆదాయాన్నిచ్చే పంటలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరి ఈ పంటలు ఒకసారి సాగు చేసినా.. మనం జీవితాంతం ఆదాయాన్ని పొందవచ్చు. మరి ఆ సాగు ఏంటి..? ఎలా చేయాలి..? ఎలా లాభాలు వస్తాయి..? అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఆ సాగు ఏదో కాదు దానిమ్మ సాగు అని చెప్పవచ్చు. దానిమ్మ సాగు చేయడం వల్ల మంచి డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా వుండదు..అయితే కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక అందుకే తాజా పండ్లు, కూరగాయలు తినడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దానిమ్మ పండు కి కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. దానిమ్మ పండులో ఉండే పోషకాలు వైరస్ ను దూరం చేస్తాయని ఎటువంటి వైరస్ ను అయినా అడ్డుకుంటాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

Business Idea Good money comes from cultivating pomegranate
Business Idea Good money comes from cultivating pomegranate

ఏ కాలంలో అయినా సరే ఫుల్ డిమాండ్ ఉండే దానిమ్మ సాగు చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి. అందుకే రైతులు కూడా దానిమ్మ సాగుపై దృష్టి పెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మన భారత దేశంలో ఇటీవల కాలంలో దానిమ్మ సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ , ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలలో ఎక్కువగా దానిమ్మ సాగు చేస్తూ ఉండటం గమనార్హం. అంతేకాదు ఈ ప్రదేశాలలోని నేల సారం కూడా దానిమ్మ చెట్లు పెరగడానికి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇక దానిమ్మ మొక్క పెరిగి పండ్లు కాయడానికి నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది. ఒక్క దానిమ్మ చెట్టు సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు బ్రతుకుతుంది. ఎవరైనా సరే దానిమ్మ సాగు చేయాలి అనుకుంటే ఆగస్టు లేదా మార్చి నెలలో దానిని మొక్కలు నాటడం ఉత్తమం.

ఏ రకమైన నేలలో అయినా సరే దానిమ్మ సాగు చేయవచ్చు. ఇక దానిమ్మ సాగు చేయడానికి నేలలో ముందుగా 20 కిలోల పేడ, పాస్పరస్ ఉపయోగించాలి. అలాగే ఈ మొక్కలకు తగినంత నీటి పారుదల ముఖ్యం. ఇక ఈ మొక్కలకి ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. అలాగే పండ్లు పూర్తిగా పండేవరకు చెట్ల నుంచి కోయకూడదు. వీటినీ పండించడం వల్ల సుమారు 8 లక్షల నుండి పది లక్షల వరకు లాభం వస్తుంది. మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఈ పండ్ల కు అధికంగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి 20 లక్షల నుండి 30 లక్షల ఆదాయం వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాలలో ఎంతో మంది రైతులు దానిమ్మ సాగు చేసి లక్షలు గడిస్తున్న రైతులు కూడా ఉన్నారు. దానిమ్మ సాగు తో కనక వర్షం కురుస్తోంది అని చెప్పవచ్చు.