Revanth Reddy.. తెలంగాణలో రాజకీయంగా చురుకుగా ఉన్న నేత రేవంత్ రెడ్డి. తాజాగా తను కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాన్వాయ్ లో ఆరు వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలోనే ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. ప్రమాదంలో ఈ వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొనడంతో పలువురికి గాయాలు కాగా అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారులోని బెలూన్ ఓపెన్ అయి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిసి అక్కడున్న వారంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను, సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ రెడ్డి శ్రీపాద ప్రాజెక్టు చూడడానికి వెళుతున్న సమయంలోనే ఇలాంటి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.