Preethi Case : ప్రీతి విషయంలో బయటకు వచ్చిన సంచలన నిజాలు.. సైఫ్ వేధింపులతో పాటు ఆ బాండ్ కూడా కారణమా.?

Preethi Case : కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రాణాలు తీసుకున్న కేసులో రోజుకు సంచలన విషయం వెలుగులోకి వస్తుంది.. తాజాగా సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక మాత్రమే కాదు .. 50 లక్షల రూపాయల బాండ్ కూడా ప్రీతి మరణానికి కారణమని.. సైఫ్ ప్రీతికి సంబంధించిన ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి గురి చేశాడని సమాచారం..

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో పాటు ఆత్మహత్యకు చెందిన పలు సెక్షన్ల కింద అరెస్టు చేయాలని కోరుతున్నారు. అసలు ప్రీతి ఇంత అఘాయిత్యానికి పడడానికి సైఫ్ కారణమని సిపిఐ నాయకులు తెలుపుతున్నారు. సైఫ్ నాలుగు నెలల పాటు ప్రీతిని ఇబ్బందులకు గురిచేసాడు. ఎనస్తీషియా పీజీ సెకండియర్ స్టూడెంట్స్ తో కలిపి మొదటి సంవత్సరం విద్యార్థులను రెండు గ్రూపులకు క్రియేట్ చేశారు. ఈ గ్రూపులలో చదువు గురించి పలు విషయాల గురించి సెకండియర్ స్టూడెంట్స్ మొదటి ఇయర్ స్టూడెంట్స్ తో వారి అనుభవాలను పంచుకుంటారు. కానీ సైఫ్ మాత్రం ప్రీతి ని టార్గెట్ చేస్తున్నాడు.

అతని వేధింపులు పీక్స్ కి చేరుకున్నాయి . ఫిబ్రవరి 13 2023 హాస్పిటల్ లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరైంది. ప్రీతి ఆమె పర్యవేక్షణలో ఉన్న కేసు షీట్లు కావాలనే తీసుకొని బ్రెయిన్ లెస్ అని వాట్సప్ గ్రూపులో పెట్టాడు. అలా తనని టార్గెట్ చేస్తున్న సైఫ్ ని ప్రీతి తనపై హెచ్ ఓ డి కి కంప్లైంట్ చేసింది. కానీ వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. దాంతో ప్రీతి తన ప్రాణాలను తనే తీసుకుంది.

దీనితోపాటు పేజీ సీట్ వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ కింద 50 లక్షలు అగ్రిమెంటుపై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ కాలేజ్ నుంచి కాకుండా మరే కాలేజ్ కి వెళ్ళినా కూడా 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రీతి ఆ కాలేజ్ నుంచి మారకుండా అక్కడే ఉందని.. అతని వేదింపులకు గురై చివరికి తన ప్రాణాల్ని కోల్పోయిందని మరో విషయం వెలుగులోకి వచ్చింది.