WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి రంగం సిద్ధం అయ్యింది. సంవత్సరాల తరబడి నిరీక్షణకు తెరపడింది.. ఇవాళ డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే తొలి లీగ్ మ్యాచ్ తో ఉమెన్స్ క్రికెట్లో కొత్త చరిత్ర మొదలుకానుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ గేయింట్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది . బెంగళూరు, గుజరాత్, ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ , యూపీ వారియర్స్ జట్లు పాల్గొనబోతున్నాయి . ఒక ఎలిమినేటర్ , ఫైనల్ తో సహా లీగ్ లో మొత్తం 22 మ్యాచులు జరగబోతున్నాయి.
ప్రతి టీం కూడా ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచులు ఆడాలి.. టాప్గా నిలిచిన టీం నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది.. రెండు , మూడు స్థానాల్లోని రెండు టీముల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ లీగ్ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇకపోతే ఈరోజు రాత్రి ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ లో గుజరాత్ గెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మధ్య పోటీ జరగబోతోంది.