Black Turmeric : నల్ల పసుపు తో అధిక లాభాలు.. ఇక ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Black Turmeric : సాధారణంగా పసుపు అనేది ఆయుర్వేదం పరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రసాధించిన ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. జలుబు చేసిన దగ్గర్నుంచి మరెన్నో పెద్ద పెద్ద రోగాలను నయం చేసే శక్తి పసుపుకు ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. పసుపులో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ , బ్యాక్టీరియా చేరకుండా ప్రతి ఒక్కరికి రక్షణగా ఉంటుంది. కేవలం ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా సౌందర్య సాధనాలలో అలాగే మతపరమైన పూజా విధానాలలో కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును ఒక దేవత రూపం గా పరిగణించడం గమనార్హం. మార్కెట్లో వేటికైనా డిమాండ్ తగ్గుతుందేమో కానీ పసుపుకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిమాండ్ తగ్గదు అని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు పసుపు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది.

కాబట్టి ప్రతి వంటకాలలో కూడా తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పసుపు ఉపయోగించడం వల్ల ఆ కూర కి మంచి రంగు రావడమే కాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే పసుపులో రెండు రకాలు ఉన్నాయి . మనం ఇప్పుడు నల్ల పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నల్ల పసుపు వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చెప్పబోయే ఈ నల్ల పసుపు వ్యాపారం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ పసుపు పండించడం వల్ల అధిక లాభాలు కూడా రైతుకి సొంతం అవుతాయి. మరి నల్ల పసుపు పండించే టప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి. పసుపుతో వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Real Facts About Black Turmeric
Real Facts About Black Turmeric

ప్రస్తుతం రైతులకు నల్ల పసుపు బాగా లాభాలను తీసుకొస్తోంది . ముఖ్యంగా పసుపు తో పోల్చుకుంటే నల్ల పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి . అంతే కాదు వీటి ధర కూడా ఎక్కువగా పలుకుతోంది. నల్ల పసుపు కూడా సాధారణ పసుపు లాగే ఉంటుంది. కానీ ఆకుల మధ్య నల్లని గీతలు ఉంటాయి. నలుపు రంగులో ఉండే పసుపు పండించడం వల్ల రైతులు కోట్ల లాభాన్ని పొందుతున్నారు. ఈ దుంపలు లోపల నుంచి పసుపు రంగులో కాకుండా ఊదా రంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఒక ఎకరం పొలం లో రెండు క్వింటాళ్ల నల్ల పసుపు విత్తనాలను మీరు నాటాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పసుపు పంటకు పెద్దగా నీటిపారుదల అవసరం లేదు. అలాగే కెమికల్స్ వంటివి కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇక ఈ పంటకు చీడపీడల బాధ అసలుకే ఉండదు. కేవలం ఆవుపేడతో తయారు చేసిన ఎరువు ను ఉపయోగిస్తే సరిపోతుంది .

మార్కెట్లో సాధారణ పసుపు ధర కిలో 200 రూపాయల వరకు పలుకగా నల్ల పసుపు ధర ఏకంగా 500 నుంచి వెయ్యి రూపాయల వరకు కిలో పలికిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నల్ల పసుపు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో ఈ పసుపు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. లాభాల విషయానికి వస్తే ఒక ఎకరంలో నల్ల పసుపు సాగు చేస్తే 60 నుంచి 70 క్వింటాళ్ల పసుపు వస్తుంది. బాగా ఎండిన తర్వాత 15 క్వింటాళ్లు ఎండ పసుపును ఈజీగా మనకు లభిస్తుంది. ఇక సుమారుగా ఒక కిలో నల్ల పసుపు వెయ్యి రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు అమ్ముడు పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే నిత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పసుపు అత్యధిక ధర పలుకుతుంది లక్షల లాభాలను పొందవచ్చు. మరికొంతమంది రైతులు అయితే ఏకంగా కోట్లల్లో లాభాలు పొందుతారు .కాబట్టి తక్కువ శ్రమ ఎక్కువ లాభాన్ని అందించే ఈ పసుపును మీరు పండిస్తే అధిక లాభాలను పొందవచ్చు.