Ravanasura.. మాస్ మహారాజా తాజాగా నటిస్తున్న చిత్రం రావణాసుర.. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ ఏడవ తేదీన సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో లాయర్ గా రవితేజ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ తో రవితేజ పాత్ర విషయంలో సస్పెన్స్ నెలకొంది.. తాజాగా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం.. టీజర్ చూసిన తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరగడంతో పాటు సినిమాలోని రవితేజ పాత్ర చూసి మరింత సస్పెన్స్ క్రియేట్ అవుతోంది.
టైటిల్ కి తగ్గట్టుగా రవితేజ నిజంగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ధమాకా సినిమాతో ఎంటర్టైన్మెంట్ అందించిన రవితేజ.. ఈసారి రావణాసుర లోని తన పాత్రతో థ్రిల్ చేయబోతున్నట్లుగా సమాచారం. మరి టీజర్ చూస్తుంటేనే సక్సెస్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అర్థమవుతుంది.. ” సీతను తీసుకెళ్లాలి అంటే సముద్రం దాటితే సరిపోదు ఈ రావణాసురుడిని కూడా దాటి వెళ్లాలి ” అనే డైలాగు టీజర్ కే హైలెట్గా నిలిచింది. మొత్తానికైతే ఈ సినిమాతో ఈయన మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.