NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అందరూ ఊహించినట్టుగానే జాన్వీ కపూర్ ను ఇందులో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో చాలా అందంగా ఆకర్షణయంగా కనిపిస్తోంది జాన్వీ కపూర్.
జాబిలి వంటి మోముతో పరికిణిలో చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు తన నడుము అందాలను చూపిస్తూ హైలైట్ చేసింది. ఏది ఏమైనా ఈమెకు ఇది మొదటి సౌత్ ఇండియా సినిమా కాబట్టి ఈమెకు ఖచ్చితంగా సక్సెస్ అందివ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
View this post on Instagram