Indian Police Story : ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వారి పేర్లతో పిలిచిన బిచ్చగాడు.. అసలు కథ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

Indian Police Story : గ్వాలియర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఈ సందర్భంగా అర్ధరాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో ఇద్దరు డిఎస్పీలు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు చలిలో వణికిపోతూ కనిపించాడు.. ఆయన పరిస్థితి చూసి జాలిపడి ఒక అధికారి తన బూట్లు ఇవ్వగా రెండో అధికారి తన జాకెట్ ఇచ్చారు. అవి విచ్చేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా ఆ బిచ్చగాడు వారిద్దరిని వాళ్ళ పేర్లు పెట్టి పిలిచారు అది విని ఇద్దరు అధికారులు ఆశ్చర్యపోయారు. మళ్ళీ వెనక్కి వెళ్లి ఆ బిచ్చగాడిని కలిశారు. అతను ఎవరో గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకి అర్థం కాలేదు. వెంటనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ సహాయంతో పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.

అతనితో మాట్లాడగా అప్పుడే వారికి అర్థమైంది ఆ బిచ్చగాడు వాళ్ళ బ్యాచ్ లోనే సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ మిశ్రా గత పదేళ్లుగా ఇలాగే ఆయన యాచకుడిలా రోడ్లు మీద తిరుగుతున్నాడని తెలుసుకున్నారు . గ్వాలియర్ లో ఝాన్సీ రోడ్డు ప్రాంతంలో చాలా ఏళ్లుగా వీధుల్లో వికారిగా తిరుగుతున్న మనీష్ మిశ్రా మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలో 1999 బ్యాచ్ అధికారి .ఆయన షార్ప్ షూటర్ కూడా. నగరంలో ఓట్ల లెక్కింపు రోజు రాత్రి భద్రతా వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యత డీఎస్పీలైన రత్న సింగ్ తోమర్ విజయ్ బౌదీరీయలకు అప్పగించారు.

 

తమ స్నేహితుడిని అలా దారి పక్కన దినస్థితిలో చూసి వాళ్ళు చలించి పోయారు. తమతో పాటు ఆయన్ని తీసుకువెళ్లి ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో ఆయన్ని స్వర్గ సదన్ ఆశ్రయమానికి పంపించారు. ఇప్పుడు అక్కడ మనీష్ కు చికిత్స చేస్తున్నారు . మనీష్ మిశ్రా శివపురిలో నివసించారు. ఇప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు అక్కడే వృద్ధాప్యంలో జీవిస్తున్నారు. తోబుట్టువులు చైనాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నారు. చైనాలో ఉన్న మనీష్ చౌదరి ఫోన్ చేసి ఆయన పరిస్థితి గురించి విచారించారని ఆశ్రమ సంచాలకులు పవన్ సూర్యవంశీ తెలిపారు. వీలైనంత త్వరలో తను వస్తానని అప్పటివరకు సోదరుడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు.

 

2005 వరకు మనీష్ మిశ్రా ఉద్యోగం చేశారు. అప్పట్లో దతియా జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేశారు. ఆ తరువాత ఆయన మానసిక పరిస్థితి దెబ్బతింది . మొదట ఐదు ఏళ్ళు ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. చికిత్స కోసం ఆయనను ఎన్నిసార్లు ట్రీట్మెంట్ కేంద్రాలలో ఆశ్రమాలలోనూ చేర్పించిన ఆయన అక్కడి నుంచి పారిపోతుండేవారు. ఆయన ఎక్కడికి వెళ్లి పోయారు కుటుంబానికి కూడా తెలిసేది కాదు. భార్యతో విడాకులు కూడా అయిపోయాయి . మనీష్ బ్యాచ్ మేట్ లో ఇద్దరూ ఆయన్ను కలవడానికి తరచూ ఆశ్రమానికి వెళ్తున్నారు. తమ స్నేహితుడు సాధారణ జీవితం గడపడానికి కావలసినంత సహాయాన్ని వారు అందించారు. తమ స్నేహితుడు కోలుకొని మామూలు జీవితం ప్రారంభించాలని వాళ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.