రాకేష్ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య చిచ్చు పెట్టింది ఎవరో తేలిపోయింది?

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మొన్న మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడినుండి రాకేష్ మాస్టర్ కి సంబందించిన అనేక విషయాలు లీక్ అవుతూ వస్తున్నాయి. రాకేష్ మాస్టర్ ఒక డాన్సర్ గా ఎంత పేరు సంపాదించుకున్నారో, అంతకంటే ఎక్కువగా అనేక వివాదాలు ఆయన్ని చుట్టి ముట్టాయి. దానికి కారణాలు కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ వివాదాల్లో ముఖ్యమైనది గురు శిష్యుల వార్. అదేనండి శేఖర్ మాస్టర్ – రాకేష్ మాస్టర్ మధ్య గొడవ. రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడు శేఖర్ మాస్టర్. సొంత అన్నదమ్ముల కంటే ఆప్యాయంగా మెలిగిన వీరి మధ్య అనేక విభేదాలు తలెత్తాయి.

ఒక పూట తిండికి ఇబ్బంది పడే స్థాయిలో రాకేష్ మాస్టర్ వద్దకు శేఖర్ మాస్టర్ వస్తే శేఖర్ టాలెంట్ చూసిన రాకేష్ మాస్టర్ తన శిష్యుడిగా అక్కున చేర్చుకున్నాడట. ఈ క్రమంలో ఏకంగా తన అసిస్టెంట్ చేసుకుని డాన్స్ నేర్పాడు. అంతేకాకుండా సినిమా అవకాశాలు వచ్చేలా చేశాడు. అయితే శేఖర్ మాస్టర్ స్టార్ గా ఎదిగాక మాత్రం రాకేష్ మాస్టర్ ని నిర్లక్ష్యం చేశాడనే నెపంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. రాకేష్ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య గొడవలకు బీజం పడింది, చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీ విషయంలోనే. ఆ మూవీలో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా ఆ విషయం శేఖర్ మాస్టర్ నాకు చెప్పకుండా దాచాడు అనేది రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించాడు.

అక్కడితో వీరిమధ్య వార్ షురూ అయింది. అయితే ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ చేసినా వ్యాఖ్యలకు శేఖర్ కూడా స్పందించాడు. చిరంజీవి సినిమాకు కొరియోగ్రఫీ చేయడం ఒక కల. అది తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఆ సినిమాలో 2 సాంగ్స్ చేస్తానని పూర్తి స్పష్టత నాకు అప్పట్లో లేదు. కన్ఫర్మ్ అయ్యాక గురువుగారితో చెబుదామని అనుకున్నాను. ఆయనకున్న వేల మంది శిష్యుల్లో నేను కూడా ఒకడిని. నాకు డాన్స్ నేర్పారు నేను ఒప్పుకుంటాను. కానీ అవకాశాల విషయంలో ఎవరి కష్టం వాళ్ళది. నన్ను ఏరా పోరా అన్నా కూడా నేను బాధపడను. కానీ అంతకు మించి మాట్లాడితేనే నాకు బాధేస్తుంది. తాగి మా అమ్మను తిట్టాడు. నా భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడని రాకేష్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా ఆరోపణలు చేశాడు.

ఇది జరిగిన తరువాత కొన్నాళ్ళకు మరో సందర్భంలో రాకేష్ శేఖర్ భార్య గురించి మాట్లాడుతూ విలపించడం అనేకమందికి బాధ కలిగింది. దాంతో వీరి మధ్య చిచ్చు పెట్టింది శేఖర్ మాస్టర్ భార్య అనే విషయం సోషల్ మీడియాలో ఒక్కసారి ట్రెండ్ అయింది. విషయం ఏమంటే, ఓసారి శేఖర్ గురించి రాకేష్ మాస్టర్ కాల్ చేస్తే ఆ కాల్ శేఖర్ మాస్టర్ భార్య లిఫ్ట్ చేసి కాస్త పరుష పదజాలంతో మాట్లాడిందట. ఎంత గురువైతే మాత్రం అన్ని మీకు చెప్పే చేయాలా? అంటూ మాట్లాడిందని రాకేష్ మాస్టర్ వాపోయాడు. ఈ నేపథ్యంలో వాడిని నేను ఎప్పటికీ కలవను. నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దని చెబుతున్నాను. వాళ్ళ భార్య కూడా నన్ను శత్రువును చూసినట్లు చూస్తుంది… అంటూ రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.