మహేష్ బాబు తనయ సితార చిత్తు చేసిందిగా… సాయి పల్లవినే మించిపోయింది!

టాలీవుడ్ స్టార్ కిడ్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెత సీతు పాపకి సరిగ్గా సరిపోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించిన సితార తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. తరచూ మహేష్ బాబు నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసి, వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. ఇంకేముంది కట్ చేస్తే ఆ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని ‘సారంగదరియా’ సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది.

ఇక ఆ పాటలో తన పెర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఘట్టమనేని అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు. మా సీతు పాప సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీడియోలోకి వెళితే అది ‘సారంగదరియా’ ఫోక్ సాంగ్. సినిమాలో ఈ పాటకు సాయి పల్లవి చేసినట్లుగా డాన్స్ చేయడం అయితే చాలా కష్టం అని అందరికీ తెలిసినదే. అయినప్పటికీ సితార పాప విజయవంతంగా డాన్స్ ఇరగదీసింది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే, కొన్ని సార్లు సాయి పల్లవినే మించి డాన్స్ చేయడం కొసమెరుపు. ఇక్కడ ప్రొఫెషనల్‌గా కాకుండా క్యూట్‌గా పెర్ఫామ్ చేయగలిగింది సితార. దాంతో మంచి మార్కులే కొట్టేసింది ఘట్టమనేని వారసురాలు.

ఇకపోతే, ఈ వీడియోలో లంగావోణి కాస్టూమ్స్ ధరించిన సితార లుక్స్ చూపరులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఈ సారంగదరియా సాంగ్‌ను సితారకు అనీ మాస్టర్‌ నేర్పించినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వీడియోని కేవలం గంట సమయంలోనే దాదాపు లక్ష మంది లైక్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. చాలామంది సినిమా పండితులు సితార యాక్టివిటీస్ ని గమనించి ఫ్యూచర్‌లో హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ జోశ్యం చెబుతున్నారు. ఇక ఆమధ్య తండ్రి మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ చిత్రంలోని పెన్నీ సాంగ్‌ ప్రోమోలో సితార కనిపించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు, సునిల్, రఘుబాబు, మహేష్ ఆచంట, జయరాం తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు అయితే ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా 2024 సంక్రాతి కానుకగా రిలీజ్ కాబోతోంది.