రాకేష్ మాస్టర్ ఇక లేరని తట్టుకోలేకపోతున్న మహేష్ బాబు?

టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఇక లేరనే విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. రాకేశ్‌ మాస్టర్‌.. ముక్కురాజు మాస్టర్ వద్ద కొన్నాళ్ళు శిష్యరికం చేసిన తరువాత ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్లో దూసుకుపోయారు. ఈ క్రమంలో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నారు. అలా టాలీవుడ్లోని పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేశారు రాకేష్ మాస్టర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారనే విషయం బహుశా మీకు తెలియకపోవచ్చు.

అలా ఆయన కొరియోగ్రఫీ అందించిన సినిమాల లిస్టులో లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య, చిరునవ్వుతో, అమ్మో పోలీసోళ్ళు వంటి సూపర్ హిట్ సినిమాలు వున్నాయి. దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేసిన ఆయన దగ్గర నేడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే కావడం విశేషం. వారిలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. అంతేకాకుండా మణిచందన, వేణు, ప్రభాస్, మహేష్ బాబు, ప్రత్యూష వంటి స్టార్స్ కిడ్స్ ఆయన దగ్గర డాన్స్ పాఠాలు కూడా నేర్చుకున్నారు.

సరిగా 2 నెలలు క్రిందట ‘హనుమాన్’ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మాస్టర్‌కు తీవ్రమైన వాంతులు, విరోచనాలు అవ్వడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. రాకేశ్ మాస్టర్ స్థితిని గ్రహించిన డాక్టర్లు ఎక్కువ కాలం బ్రతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారట. ఇది జరిగి వారం రోజులు కాకమునుపే గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మొన్న సాయంత్ర 5 గంటల సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ స్తమించింది. దాంతో ఆయన దగ్గర పనిచేసిన శిష్యులు, డాన్స్ నేర్చుకున్న స్టార్ హీరోలు ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజాగా ఆ లిస్టులో చేరిపోయాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు కూడా తన కెరీర్ తొలినాళ్లలో డాన్స్ మూమెంట్స్ నేర్చుకోవడానికి రాకేష్ మాస్టర్ ని అశ్రయించినట్టు తెలుస్తోంది. దాంతో ఆయనకి మహేష్ కి మధ్య కొంత బంధం ఏర్పడింది. అయితే త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న మహేష్ కి రాకేష్ మాస్టర్ మరణ వార్త కాస్త ఆలస్యంగా తెలిసిందట. దాంతో సెట్స్ లోనే అతగాడు అప్సెట్ అయ్యాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్న రోజులను గుర్తు చేసుకొని దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర బాగా ఎమోషనల్ అయ్యాడట మహేష్ బాబు.