టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా ప్రస్తవించాల్సిన పనిలేదు. మహేష్ సినిమా కెరీర్ పరంగా వరుస విజయాలతో, భారీ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. విశేష ప్రేక్షకాభిమానుల హృదయాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఆయన నటించిన అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకోవడంతో పాటు కోట్లాది రూపాయల కలెక్షన్ ని కొల్లగొడుతున్న విషయం అందరికీ తెలిసినదే.
ప్రస్తుతం మహేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా మారనుంది. సగటు మహేష్ బాబు అభిమాని మహేష్ ని ఎలా చూడాలని అనుకుంటాడో అదేవిధంగా ఈ సినిమా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక దాదాపుగా అన్ని వర్గాల ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్ కలిగిన మహేష్ బాబు మరొక్కసారి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు.
విషయం ఏమిటంటే, మన సూపర్ స్టార్ మహేష్ హైదరాబాద్ శివార్లలో సుమారు వందల ఎకరాల స్థలంలో చాలా విలాసవంతమైన సినిమా స్టూడియోని నిర్మించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దీన్ని శంకుస్థాపన చేయడం కోసం కోలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ ని దింపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో ఈ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. దాంతో ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇక ఇది మాత్రమే కాకుండా మరో విషయం కూడా ప్రస్తుతం టాలీవుడ్లో చాలా స్పీడుగా చక్కెర్లు కొడుతోంది. ఆయన తన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం కోసం జీఎస్టీ తో కలిపి ఏకంగా రూ. 82 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్ రీజినల్ సినిమాలు చేస్తున్న హీరోల రెమ్యునరేషన్ విషయంలో ఇదే టాప్ రికార్డు అని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా ఇలా రెండుసార్లు ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వార్తలో నిలవడం కొసమెరుపు. కాగా గుంటూరు కారం మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది.