పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. క్యూట్ పిక్ వైరల్!

ప్రముఖ నటి ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. దేవదాస్ సినిమా తర్వాత ఈ గోవా బ్యూటీ మహేష్ బాబు తో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు సరసన నటించిన పోకిరి సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఆ తరువాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది.

ప్రస్తుతం ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది అనే వ్యాఖ్యలు రావటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పట్నుంచి ఆమె పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇలియానా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన అభిమానులకు ఒక తీపి కబురును షేర్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తను ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఫాన్స్ తో పంచుకుంది. ఆమె తన కొడుకుకు కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టారు.

ఆమె తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ “నా కొడుకును ప్రపంచానికి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పింది. ఇలియానా, ఆమె భర్త శాన్ జాన్ డోలన్ 2019లో ప్రేమలో పడ్డారు. వారు 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి కాకుండానే ఇలియానా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె అనేక బాక్స్ ఆఫీస్ హిట్లలో నటించారు, వీటిలో “జుంజున్”, “బెల్బాత్”, “రెడ్” ఉన్నాయి. ప్రస్తుతం ఇలియానా తన కొడుకు తో ఎంజాయ్ చేస్తుంది. ఈ శుభ సందర్భంగా అభిమానులు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.