Punch Prasad: విషమించిన జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం.. ముక్కులోంచి రక్తం కూడా..!

Punch Prasad.. జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయనకు సాయం చేయడానికి తోటి కంటెస్టెంట్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కిరాక్ ఆర్ పి పంచ్ ప్రసాద్ ఆపరేషన్ ఖర్చు అంతా తానే భరిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక మీడియాతో స్వల్పంగా కోలుకొని పంచ్ ప్రసాద్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

Punch Prasad | Jabardast Panch Prasad is unable to walk.. Nukaraju  explained the situation

ఆయన మాట్లాడుతూ..” నాకు సహాయం చేయడానికి చాలామంది జబర్దస్త్ కంటెస్టెంట్లు ముందుకు వచ్చారు. వారందరికీ రుణపడి ఉంటాను.. పెళ్లయిన కొత్తలో నా ముక్కులో నుంచి తరచూ రక్తం రావడంతో నా భార్య ఆసుపత్రికి తీసుకెళ్ళింది.. అప్పుడే నా రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు.. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది.. నా కాలు, ఎముకకు చీము రావడంతో నడవలేని స్థితికి వెళ్ళిపోయాను . ప్రస్తుతం స్వల్పంగా కోలుకున్నా.. త్వరలోనే ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నాను అంటూ తెలిపారు.