Health Tips :ప్రతిచోట కనిపించే వీటిని తింటే ఏమవుతుందో తెలుసా..

Health tips యుర్వేదం అనేది ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం. పూర్వపు రోజుల్లో ఆసుపత్రులు లేని సమయంలో.. ఆయుర్వేద మందులతోనే చాలామందిని బతికించేవారు. ఆయుర్వేద మందులతో నయం కాని జబ్బేమీ ఉండదు. ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే రోగాలు జన్మలో కూడా మన దరి చేరవని పెద్దలు చెబుతుంటారు. అలాంటి ప్రకృతి ఒడిలో ఉన్న మరో ఔషధ చెట్టు విరిగి కాయల చెట్టు.. దీనిని విరిగి కాయల చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయల చెట్టు, బంకీర్ కాయల చెట్టు ఇలా రకరకాలుగా, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో ఎలా పిలిచినప్పటికీ వీటి ప్రయోజనం మాత్రం సమానంగా ఉంటుంది.. ఈ కాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు, పై బెరడు, విత్తనాలు ఇలా అన్నింటిలో యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, ఫాస్ఫరస్ ఇలా ఎన్నో గుణాలు కూడా ఉన్నాయి. ఈ పండ్లు ఎర్రగా మాగిన తరువాత తినడం వల్ల నోటి పూత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది

శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. శరీరానికి చలువను కూడా చేస్తుంది.ఈ పండ్లు తినడం మూలంగా మన రక్తంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. నక్కెర పండ్లకు డయాబెటిస్ ను కంట్రోల్ చేయగల శక్తి ఉంది. ఈ పండ్లు తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను మీ డైట్ లో భాగం చేసుకుంటే మంచిది. సుఖ విరేచనం కూడా అవుతుంది.

ఈ చెట్టు యొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ చెట్టు యొక్క బెరడు ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో తడిపి చర్మంపై అప్లై చేస్తూ ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. దురద ఎక్కువ అయినప్పుడు ఈ చెట్టు యొక్క విత్తనాలను మెత్తటి పేస్ట్ లా చేసుకొని దురద వున్న ప్రాంతాల్లో రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.