Andhra Pradesh: మార్చ్ 17 న బడ్జెట్.. 14న ఏపీ అసెంబ్లీ..!

Andhra Pradesh.. త్వరలోనే ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 17న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.. తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా తీర్మానంపై చర్చించడంతోపాటు ముఖ్యమంత్రి కూడా సమాధానం ఇవ్వనున్నారు. అలాగే మార్చి 28 29 తేదీలలో విశాఖపట్నంలో G20 సదస్సులు జరగనున్న నేపథ్యంలో అంతకుముందే అనగా మార్చ్ 25 లేదా 27న బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు ముఖ్యమంత్రి.

Andhra Pradesh Legislative Assembly passes CRDA Billమధ్యలో మార్చి 22వ తేదీన ఉగాది సందర్భంగా ఒక్కరోజు లేదా రెండు రోజులపాటు సెలవు ఇవ్వనున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంకి తాను తన కార్యాలయం తరలి వెళ్లడంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ సమావేశాలలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని.. వైసిపి వర్గాలు కూడా చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల అందరి చూపు బడ్జెట్ పైనే ఉంది. మరి ఈ క్రమంలో ఏ క్యాటగిరీలో ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చూడాలి.