Preethi : సైఫ్ ను ఉరి తీయాలన్న ప్రీతి చెల్లెలు..

Preethi: కాకతీయ మెడికల్ కాలేజీ కి చెందిన పి.జి మొదటి సంవత్సరం రావత్ ప్రీతీ సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది .. తన సోదరీమృతిపై అనేక అను మానాలను తెలిపింది. గిరిజన తెగకు చెందిన అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేశారని తెలిపింది.. ఏకంగా అందరూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని తన చెల్లిపై చర్చించుకునే వారని తెలిపింది. తోటి పీజీలు, సీనియర్లు అంతా ఒక్కటే తనని వేధించారని ఆమె పేర్కొంది. ఈ విషయంపై హెచ్ ఓ డి ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేసిన పట్టించుకోలేదని బాధపడింది పోలీసుల విచారణ మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించింది సోదరీ పూజ డిమాండ్ చేసింది. నిందితుడు సైఫ్ ను ఉరితీయాలని ఆమె కోరింది.

నిన్న గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజా వచ్చేటప్పుడు మా అక్క దగ్గరికి పూలదండ తీసుకొని వచ్చారు. అంటే మా అక్క చనిపోయిందా.. చనిపోయిన వాళ్లకే కదా పూలదండ తీసుకు వస్తారు. సాటి మహిళ అయి ఉండి కూడా మరో మహిళను పట్టించుకోవడం లేదు. అక్క కేసు పట్టించుకోవడానికి ప్రత్యేక కమిటీ ఎందుకు వేయలేదని పూజ ప్రశ్నించింది. మా అక్కను అడ్డం పెట్టుకొని మీరందరూ వచ్చి కలిసి పరామర్శించి సానుభూతిని పొందుతున్నారు. కానీ మావల్ల మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ మీ వల్ల మాకు ఒరిగిందేమీ లేదు అని పూజ అంది.

మా అక్క ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదైతే కాదు ఖచ్చితంగా సెఫ్ మా అక్కను చంపేశాడు. తనని ఉరి తీయాలి అంటూ పూజ ప్రభుత్వాన్ని కోరింది. మా అక్క కు న్యాయం చేయాలని కోరింది. మిగతా కేసులలో చాలామందిని ఉరితీసారని.. మా కేసును ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అని పూజా ప్రశ్నించింది కచ్చితంగా నిందితుడైన సైఫ్ కు ఉరిశిక్ష పడాలని ఆమె కోరింది.

ప్రీతి తండ్రి నరేందర్ సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హెచ్ ఓ డి ని సైతం సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. సస్పెండ్ చేస్తేనే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. సైఫ్ తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని చెబుతున్నారు. నేటి తెల్లవారుజామున ఆమె స్వగృహం జననగామా జిల్లా కోడగండ్ల మండలం మెండ్రాయి గిర్ని తండాకి తరలించారు. మరికేసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.