Sunil.. ఏపీ సర్కార్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సోమవారం రోజు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. ప్రస్తుతం ఇంకా కేసు విచారణ దశలో ఉండడం వల్లే బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, నిస్సాక్షిక దర్యాప్తు ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ఇకపోతే నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ కావాలని కోరుతూ ఈనెల 13వ తేదీన పిటిషన్ దాఖలు చేయగా ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై వైయస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ అయింది.. ఈ మేరకు ఈనెల 16వ తేదీన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వాలని మరొక సారి పిటిషనర్ తరపు న్యాయవాది వాదించినా.. బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.