ఎట్టకేలకు కుదిరిన ప్రదీప్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..

ప్రదీప్ మాచిరాజు.. ఈ పేరుకి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. ప్రదీప్ ఎప్పుడూ బుల్లితెర షోలలో కనిపిస్తూ స్పాంటేనియస్ పంచులతో ఆకట్టుకుంటూ ఉంటాడు. సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తుంటాడు. టాలెంట్‌, మంచి ప్రవర్తనతో తెలుగు వారికి దగ్గరైన ఈ యాంకర్ కమ్‌ యాక్టర్ ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. అదే ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో చాలా కాలంగా తలెత్తుతూనే ఉంది. 1986లో పుట్టిన ప్రదీప్‌కు ఆల్రెడీ 36 ఏళ్లు వచ్చేసాయి. అయినా ఈ హ్యాండ్సమ్‌ యాంకర్ ఇప్పటివరకు పెళ్లి ప్రస్తావన ఎత్తడం లేదు.

ఈ క్రమంలోనే టీవీ వర్గాల్లో ప్రదీప్ పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది. అదేంటంటే ప్రదీప్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రాయలసీమకు చెందిన ఒక పొలిటిషన్ కూతురుతో ప్రదీప్ పెళ్లి కుదిరింది. అయితే అధికారికంగా అటు ప్రదీప్ గానీ లేదా అమ్మాయి తరఫు ఫ్యామిలీ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పెళ్లి గురించి ప్రదీప్ మాత్రమే ప్రకటించనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మొన్నటిదాకా ప్రదీప్ ను “పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు” అని చాలామంది ఆట పట్టించారు. ఈ వార్త విన్న తర్వాత ఇకపై వారి ఆటలు సాగవని అభిమానులు ఖుషి అవుతున్నారు. అమ్మాయి ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి వారి తపన పడుతున్నారు. అయితే అసలు పెళ్లి కుదిరిందా లేదా అనేది మాత్రం అధికారికంగా ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇకపోతే బుల్లితెరపై ప్రదీప్ జోరు బాగానే తగ్గింది. అతనితోపాటు బుల్లితెర పైకి అడుగుపెట్టిన చాలామంది సినిమాల్లో సెటిల్ అయిపోయారు. ప్రదీప్ కూడా సినిమాల్లో సెటిల్ అయిపోతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.