టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా అభిమానాన్ని పొందే ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. టాలీవుడ్ ప్రేక్షకులు వీరిపై కురిపించే అభిమానాన్ని చూసి మిగతావారు ఓరవలేరు. వారి ఏడుపే కారణమై అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో పడుతుంటుంది. ఈ మధ్య నిహారిక డివర్స్ వల్ల మెగా కుటుంబం చాలా బాధలో మునిగిపోయింది. నిహారికను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి అంగరంగ వైభవంగా నాగబాబు పెళ్లి చేశాడు. బిడ్డ పెళ్లి బాధ్యతను తీర్చుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతని సంతోషాన్ని నిహారిక ఎంతో కాలం నిలవనివ్వలేదు. ఆమె తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంది.
అయితే విడాకులు తీసుకోకముందు నిహారికని నాగబాబు ఇంతగానో బతిలాడట. డివోర్స్ తీసుకోవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడట. కానీ నిహారిక చైతన్యతో ఒక్క క్షణం కూడా తాను కలిసి ఉండనేనని చెప్పి తండ్రి మాటను కూడా జవదాటిందట. అందుకే నిహారికను తన ఇంటికి అసలు రానివ్వనని, ఆమెతో మాట్లాడనని కుటుంబ సభ్యులందరి ముందే మెగా బ్రదర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట. అయితే సరిగ్గా నిహారిక విడాకుల గొడవ మొదలైన సమయంలోనే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య మెగా కుటుంబంలో అడుగుపెట్టింది. లావణ్య, వరుణ్ ప్రేమించుకున్నారు కాబట్టి ఆమె వరుణ్ తేజ్ పెళ్లి చేయడానికి నాగబాబు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.
అలా ఆమె వీరి ఇంట అడుగు పెట్టింది. అయితే విడాకుల సమయంలో నిహారికను నాగబాబు తిట్టిపోస్తుంటే ఆమెకు లావణ్య చాలా సపోర్ట్ గా నిలిచిందట. అంతేకాదు విడాకులనేది ఒక లావణ్య మాత్రమే కోరడం లేదని, చైతన్య కూడా ఆమెతో కలిసి ఉండడానికి ఇష్టపడటం లేదని, అలాంటప్పుడు వారిద్దరూ విడిపోవడమే మంచిదని లావణ్య నాగబాబుకి చెప్పి చూసిందట. అయితే విడిపోతున్న వారిని కలపడం తల్లిదండ్రులుగా మా ధర్మం అని లావణ్యతో నాగబాబు పెద్ద గొడవ పెట్టుకున్నట్లు సమాచారం. నిహారికకు ఇలాంటి సమయంలో తల్లిదండ్రులుగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మీదే మామయ్య అంటూ లావణ్య నాగబాబుని ఒప్పించడానికి కూడా ప్రయత్నించిందట. అయినా నాగబాబు కోపం తగ్గలేదని సమాచారం. అయితే గొడవల నడుమ వరుణ్ తేజ్ బాగా నలిగిపోతున్నట్లు తెలుస్తోంది.