ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన కోడి కత్తి శ్రీను.. షాకింగ్ విషయాలు చెప్పిన అడ్వకేట్..

వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కంటే ముందు సంచలనంగా మారిన కేసు మరొకటుంది. అదే కోడి కత్తి కేసు. ఇది 2018లో విశాఖ విమానాశ్రయంలో జరిగింది. ఈ కేసులో తనకు న్యాయ సహాయం కావాలని ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తాజాగా డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు తాను జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని జులై 11న ప్రకటించాడు. అయితే సానుభూతి కోసమే శ్రీను ఇదంతా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కోడి కత్తి శ్రీను కూడా తాను వైసీపీ అభిమానిని అని, జగన్ సీఎం కావాలనే ఉద్దేశంతో సానుభూతిని ప్రజల్లో సృష్టించాలని ఈ దాడి చేసినట్లు పేర్కొన్నాడు. కత్తిని స్టెరిలైజ్ చేశానని కూడా తెలిపాడు.

ఇది నిజమని గుర్తించి తనను జైలు నుంచి విడిపించాలని కూడా అతను కోరుతున్నాడు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇదంతా ప్రశాంతి కిషోర్ చేయించిన ఒక డ్రామా అని అంటున్నారు. జగన్ కి గాయమైన తర్వాత అతను ప్రాథమిక చికిత్స కూడా చేయించుకోకుండా, గాయాన్ని బాగా హైలెట్ చేశారని, అది సానుభూతి కోసమేనని వారు షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు వచ్చి ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదని, విచారణకు రాకపోవడానికి కారణం ఏంటని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఈ కోడి కత్తి కేసులో నిందితుడైన శ్రీనుకి మహా అంటే నాలుగేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడదని లాయర్లు అంటున్నారు. ఇప్పటికే శ్రీను ఆల్రెడీ జైల్‌లో నాలుగు సంవత్సరాల శిక్ష అనుభవించాడని, ఇప్పుడు అతన్ని విడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. శ్రీను కూడా నాలుగైదు వాయిదాలలో తాను బయటకు వస్తానని అంటున్నాడట. అది కూడా నిర్దోషిగా తాను రిలీజ్ అవుతానని చెబుతున్నాడని అడ్వకేట్ తెలిపారు. అభిమానంతో చేసిన దానికి తనని ఇలా చిత్రహింసలకు గురి చేయాలా అని కూడా శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు, తనకి న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు లాయర్ తెలిపారు.