Prabhas: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్.. ఆ తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అనే మాట వాస్తవం. ప్రభాస్ సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు ఎంతగానో ఎదురు చూశారు. ప్రభాస్ తో బాహుబలి తర్వాత సినిమా చేసిన ముగ్గురు హీరోయిన్లకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ హీరోయిన్ ను అసలు ఇంట్లోకి రానివ్వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటించింది. ఆ సినిమా అనుకున్న విధంగా హిట్ కాలేదు. ఇక అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన జాక్వేలిన్ కి కూడా పెద్దగా ఏం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఇక రాధేశ్యాం సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజ హెగ్డే. ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకోసారి పూజా హెగ్డే తో సినిమా నటించిన ఆమెను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ కానీ ప్రభాస్ కానీ ఇలా చేయరని ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.