Poorna: పెళ్లయింది కడుపు వచ్చింది .. పూర్ణ గురించి మీకు తెలిసింది ఇదే .. ‘ ఈ మ్యాటర్ ‘ ఎవ్వరికీ తెలీదు !

Poorna: పూర్ణ ప్రత్యేకంగా పరిచయం చెప్పనక్కర్లేదు.. హీరోయిన్ గా ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇక అది అలా ఉంటే పూర్ణ ఇటీవల ఓ దుబాయ్ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సంవత్సరం తిరగక ముందే పూర్ణ గుడ్ న్యూస్ చెబుతుంది.. ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే.. అయితే పూర్ణ నటించిన సినిమా రిలీజ్ అవుతుందని అతి తక్కువ మందికి తెలుసు .. ఆ సినిమా వివరాలు తెలుసుకోండి..

Poorna acting Suvarna sundari movie update
Poorna acting Suvarna sundari movie update

పూర్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ చిత్రం సువర్ణసుందరి.. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సువర్ణసుందరి.. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సినిమా ప్రమోషన్లలో నటి పూర్ణ కూడా పాల్గొన్నారు. తను ప్రెగ్నెన్సీ కంటే ముందే ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా ప్రమోషన్లలో పూర్ణ పాల్గొనక తప్పలేదు. ప్రస్తుతం పూర్ణ తను ముందుగా ఓకే చేసుకున్న ప్రాజెక్ట్ అన్నింటినీ పూర్తి చేసింది.. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.. ప్రెగ్నెన్సీ లో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది.

 

పూర్ణ నటించిన సువర్ణ సుందరి రియన్ కర్నేషన్ సబ్జెక్టు రోలర్ కోస్టర్ స్క్రీన్ ప్లే తో మినిట్ బై మినిట్ ఆడియన్స్ కి మంచి థ్రిల్లర్ ని ఇస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి జోనర్ లో వస్తున్న సువర్ణ సుందరి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ అయితే పూర్ణ కెరియర్ లో మరొక హిట్ పడుతుంది.. ఈ సినిమా పూర్ణ కి ఎలాంటి ఇస్తుందో చూడాలి.