MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంపై.. కవితను అరెస్ట్ చేయబోతున్నారా..!!

MLC Kavitha ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి కొద్ది సేపట్లో ప్రగతిభవన్ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసులు విచారణపై సీఎం కేసీఆర్ తో చర్చించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వేళ ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉండగా కవిత అరెస్టుపై బీఆర్ఎస్ లో పలు ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అరెస్టు అయితే ఢిల్లీ తెలంగాణ వ్యాప్తంగా పలు నిరసనలు తెలిపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి.. కవిత పిలుపు -  NTV Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెలలో ఢిల్లీలో విచారణ హాజరు కావాలని నోటీసులను జారీ చేయడం జరిగింది ఈడి అధికారులు. అయితే కవిత బినామీ అంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించాలని ఈడీ అధికారులు తెలిపారు. రిమాండ్ రిపోర్టులో కవితా పేరును కూడా ఈడీ అధికారులు ప్రస్తావించడం జరిగింది. కవిత రేపటి రోజున ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలో ఈమె పాల్గొనబోతున్నది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ తో భేటీ అనంతరం న్యాయనిర్ణేతలతో చర్చల తర్వాత ఢిల్లీ దీక్ష పైన కవిత ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.