PF Amount ఉద్యోగస్తులకు నెలనెలా తమ జీవితంలో నుంచి కొంత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పిఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం ఎంత ఉందనే విషయం తెలుసుకోవాలా? అయితే ఈ విషయము చాలామంది ఉద్యోగులకు తెలియకపోవచ్చు. పిఎఫ్ ఆఫీస్ కి వెళ్లి విచారించడమే మంచిదని అందరూ ఆలోచిస్తూ అక్కడికి వెళుతుంటారు కానీ కేవలం ఒక్క మిస్స్ డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 అనే నెంబర్కు కాల్ చేస్తే రెండు రింగుల తర్వాత ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత పిఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వివరాలతో సహా మనకి మెసేజ్ వస్తుంది. దీంతో ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొమ్ము విత్డ్రా చేసుకోవాలనుకునే వారు బ్యాంకు ఖాతా వివరాలు , ఆధార్ కార్డు , పాన్ కార్డును తీసుకొని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇలా చేసిన రెండు రోజులకే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది.