PRABHAS: మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్..!!

PRABHAS: టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు ప్రభాస్. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా రేంజ్ లోని సినిమాలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ప్రభాస్ ను మరొక లెవల్ కు తీసుకువెళ్తాయని చెప్పవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉంటున్న సమయంలోనే ప్రభాస్ అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిన్నటి నుంచి షూటింగులకి బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

2 decades of Prabhas: 5 reasons why he is loved and unparallel rising king  of Indian Cinema | PINKVILLA

నిన్న రాత్రి నుంచి ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదని ఈ కారణంగానే ఒక ప్రైవేట్ హాస్పత్రిలో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే మెరుగైన వైద్యం కోసం విదేశలకు వెళ్లబోతున్నట్లుగా ప్రభాస్ సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం నిజమా కాదా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఎందుకంటే టాలీవుడ్ మీడియా కూడా ఈ విషయంపై ఏ విధంగా రియాక్ట్ కాలేదు కేవలం ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా మాత్రమే హైలైట్ చేస్తోంది. మరి ఈ విషయంపై ప్రభాస్ టీమ్స్ స్పందిస్తే బాగుంటుంది.