Mukesh Ambani :సీఎం జగన్ చేసిన సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎన్నికల వేళ పార్టీకి జోష్ ఇచ్చింది. ప్రతిపక్షాల విమర్శలు.. జగన్ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు విశాఖ గ్లోబల్ సదస్సు తో చెక్ పెట్టారు. జగన్ సన్నిహితంగా మెలిగిన తీరు ప్రత్యేకార్షణగా నిలిచింది. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి ఏకంగా రూ 13 లక్షలకు పైగా పెట్టబడులకు ఎంఓయూలు జరిగాయి. చంద్రబాబు గతంలో చేసుకున్న ఒప్పందాల రికార్డులను అధిగమించాయి. ఒకప్పుడు అంబానీ చంద్రబాబు తో ఎంత సఖ్యత గా ఉన్నారో ఇప్పుడు జగన్ తో ఎలా ఉన్నారో అని రెండింటినీ పోలుస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. చంద్రబాబు కోసం పారిశ్రామిక వేత్తలు తరలి వస్తారని.. పెట్టుబడులు పెడతారంటూ కొంత కాలం క్రితం వరకు పెద్ద ఎత్తున ప్రచారం ఉండేది. అప్పుడు పారిశ్రామిక వేత్తలు సదస్సు నిర్వహించినప్పుడు అప్పుడు అంబానీకి చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత తో పాటు చంద్రబాబు నాయుడు అంబానీ ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు..అంబానీ తన దగ్గరకు వచ్చిన మొదలు వెళ్లేంతవరకు చంద్రబాబు నాయుడు అంబానీకి పక్కనే ఉంటూ ఎంతో గౌరవంగా సాదరంగా ఆహ్వానం పలికారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన గౌరవాన్ని మరింత పెరిగేలాగా చేశారు. ఇక ఆ మీటింగ్ ముగిసిన తరువాత కూడా అంబానీ కారు ఎక్కేంతవరకు ఆయన వెనకమాలే నడుస్తూ ఆయనకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారు.
గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు అంబానీ విశాఖ కేంద్రంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 10.50 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కీలక స్థానాల్లో ఉన్న వారు హాజరయ్యారు. అదే టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు జగన్ ఆ రికార్డులను బ్రేక్ చేసారు. ఒకే సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అంబానీ వేదిక నుంచే సీఎం జగన్ ను ప్రశంసించారు. ఏపీలో పెట్టుబడులు ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు మరింత జోష్ ఇచ్చింది. చంద్రబాబు అంబానీ ని అందరి ముందు పాలుతూ ప్రశంసల వర్షం కురిపిస్తే.. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం లో ఏకంగా అంబానీనే జగన్ ను పొగిడారు. వీళ్ళిద్దరి మధ్య మీరే అర్థం చేసుకోండి అంటూ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు.