ORMAX: ఇండియా వైడ్ గా సౌత్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ వీళ్లే..!

ORMAX.. సోషల్ మీడియాలో ఎక్కువకాలం ట్రెండ్ లో కొనసాగిన హీరోల పాపులారిటీ ఆధారంగా ఓవర్ మాక్స్ వెబ్ సైట్ ప్రతినెల మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జాబితాను అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్టును విడుదల చేయగా.. అందులో సౌత్ నుండి చాలామంది హీరోలు టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.

Image

ఇండియన్ వైడ్ గా జనవరి మోస్ట్ పాపులర్ జాబితాలో విజయ దళపతి పేరు మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇక రెండవ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిలవగా మూడవ స్థానంలో షారుక్ నిలిచారు.. నాలుగవ స్థానానికి గానూ రెబల్ స్టార్ ప్రభాస్ , ఐదవ స్థానం అక్షయ్ కుమార్, ఆరవ స్థానం తమిళ్ హీరో సూర్య , ఏడవ స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఎనిమిదవ స్థానంలో అజిత్ కుమార్, తొమ్మిదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పదవ స్థానంలో కన్నడ హీరో యష్ నిలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక లిస్టు కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.