Andhra Pradesh: ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే..?

Andhra Pradesh.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. నేతలు పార్టీ మారుతున్న నేపథ్యంలో పొత్తుల వ్యవహారం అనధికారికంగా ఖరారు అవుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశాయి పార్టీలు.. ఇకపోతే తాజాగా సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని.. దానిపైన సర్వేలు చేయగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా.. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.. వైసీపీ తిరిగి అధికారం తమదేనని ధీమాగా ఉంది.. అయితే సర్వే సంస్థలు మాత్రం టీడీపీ – జనసేన పొత్తు కలిస్తే గెలిచే గ్యారెంటీ ఉంది అంటూ విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.

Jumping Strategies From Ycp To Janasena Via Tdp | Galli 2 Delhi Telugu News

ఇప్పుడు ఏపీలో తాజా పరిస్థితులపై అధ్యయనం చేసిన ఒక సర్వే.. గెలుపు ఎవరికి దక్కుతుందో తెలిసింది. టీడీపీ – జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీకి 110 స్థానాలు దక్కే అవకాశం ఉందని, టీడీపీ కి 55 స్థానాలు, జనసేనకి ఆరు సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ టిడిపి , జనసేన పొత్తు లేకుండా వేరువేరుగా పోటీ చేస్తే అధికార వైసీపీకి 130 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ఈసారి మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేటట్టు కనిపిస్తోంది.