Raghurama krishnamraju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని అన్నారు. రాచరికం లోను ఇంతటి అద్వాన పాలన చూడలేదని.. హిట్లర్ సైతం ఒక వర్గంపై ఇంతటి అరాచకాన్ని చేయలేదన్నారు. కళ్ల ఎదురుగానే కొట్టి, తగుల బెట్టిన ఘటన పై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు వెళ్ళిన టిడిపి నేత పట్టాభి పై సెకన్ల కింద కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.
హత్యాయత్నం కేసు తోపాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసు అధికారుల నేమ్ ప్లేట్ పై కులం రాసి ఉంటుందా అని ప్రశ్నించారు. పట్టాభి పై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమన్నారు. గన్నవరం లో పాలక పక్షం వారే దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేసరు అన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే గన్నవరం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నా.. పట్టాభి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే ఆయన రెక్కలు విరిచిపెట్టి పోలీసులు తీసుకువెళ్లడం దారుణం అన్నారు. గన్నవరం ఘటనపై రాష్ట్ర నూతన గవర్నర్ నిష్పక్షపాతమైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రఘురామ కోరారు. ఒకవేళ ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయడానికి భయపడితే.. లేఖల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయాలని సలహా ఇచ్చారు. గన్నవరం ఘటనపై తాను కూడా గవర్నర్కు లేక రాయసాని తెలిపారు .

అవకాశం వస్తే గవర్నర్ ను నేనే వ్యక్తిగతంగా కలిసి ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయిస్తానని కూడా అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందని.. లేకపోతే ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతాయని ఆయన హెచ్చరించారు. గవర్నర్ ను కలిసి కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి ఐపిసి 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయలేరని ఎంపీ రఘురామకృష్ణ అన్నారు.