అభిమానుల కోరిక మేరకు టీడీపీలోకి వస్తా అంటున్న ఎన్టీఆర్… వచ్చేదెప్పుడంటే?

టీడీపీ అధినేత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారనే వార్తలు ఇపుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. దాంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వేళ ఈ భేటీ నిజంగా జరిగితే ఏం చర్చిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తుల విషయం కాస్త గందరగోళం నెలకొన్నవేళ ఈ భేటీ రాజీయవర్గాల్లో నిజంగా ఆసక్తిని రేపుతోంది. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల సినిమాతో మంచి బిజీగా వున్నాడు. అయితే ఈ ఊహాగానం ఎలా పుట్టిందో తెలియదు గానీ, జూనియర్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

కొన్నాళ్ల క్రితం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో మన జూనియర్ సమావేశం అయిన సంగతి విదితమే. ఈ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేగిన సంగతి విదితమే. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ తరువాత ఎన్టీఆర్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తారనే వార్తలు అనేకం వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కచ్చితంగా రాజకీయాలపైనే అని విశ్లేషకులు విశ్లేషించారు. కానీ ఇప్పటి వరకూ ఈ భేటీ వల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగలేదనేది తేటతెల్లం అయిపోయింది. కాగా ఇపుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారా అంటే అవుననే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ప్రస్తుత ఏపీలో రాజకీయ గందరగోళాల నడుమ టీడీపీ నలిగిపోతోందనే విషయం అందరికీ తెలిసినదే. అందుకే టీడీపీ శ్రేణులు కూడా ఎన్టీఆర్ వస్తే అక్కున చేర్చుకోవడానికి చూస్తున్నాయి. వారు అనుకున్నట్టు ఎన్టీఆర్ టీడీపీ తరుపున వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే వారికి ఇక పవన్ కళ్యాణ్ పొత్తు అవసరమే ఉండదు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా వేదికగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు యుద్దానికి దిగడం ఇపుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.

అవును, టీడీపీ ఎన్నారై అధక్షుడు అయినటువంటి కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరగటం కొసమెరుపు. ఈ సభలో జూ.ఎన్‌టీఆర్ అభిమానులు కొందరు అతని పేరును ప్రస్తావనకు తీసుకు రావడం వలన ఈ గొడవ మొదలైనట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇది నచ్చని టీడీపీ మద్దతుదారులు.. జూ.ఎన్‌టీఆర్ అభిమానులపై దాడికి దిగారని సమాచారం. కాగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో ఓ వైపు ఎన్టీఆర్ అభిమానులు, మరోవైపు టీడీపీ అభిమానులు ఒకరినొకరు దూషించుకుంటూ కామెంట్లు చేసుకుంటున్న పరిస్థితి వుంది. అయితే ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో ఎవరి కొంప ముంచుతుందో చూడాలి మరి.