అసలు పవన్‌కు, అన్నా లెజెనెవా ఎలా పరిచయం అయ్యింది? ఆమె బ్యాగ్రౌండ్ విశేషాలివే!

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో వున్న అత్యధిక ఫ్యాన్ బేస్ వున్న హీరోలలో ప్రధమ స్థానంలో నిలుస్తారు పవన్. ఈయన ప్రస్తుతం సినిమాలలో బిజీగా గడుపుతూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేన పార్టీ అధినేతగా ఈయన రాష్ట్ర రాజకీయాలను వేడిక్కిస్తున్నారు. ఇక వృత్తిపరంగా పవన్ కళ్యాణ్ జీవితం చాలా సంతృప్తికరంగా సాగినప్పటికీ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి. తెలుగులో మూడు వివాహాలు చేసుకున్న హీరోగా వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ఈయన ప్రత్యర్ధులు రాజీయంగా ఈయనని ఎదుర్కొనలేక వ్యక్తిగత విషయాల గురించి తనని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ ఉంటారు.

ఇక పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వీరు అనతికాలంలోనే విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత నటి రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వీరిద్దరికీ అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు కూడా కలరు. దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసున్న వీరు రేణు దేశాయ్ తో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక చివరిగా రష్యా యువతి అన్నా లేజినోవా అనే ఆమెను ఈయన 3వ వివాహం చేసుకున్నారు. ప్రస్తుత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. అయితే పవన్ కళ్యాణ్ అన్నా లేజినోవా అనే విదేశీ యువతిని పెళ్లి చేసుకోవడంతో అసలు ఆమె పవన్ కళ్యాణ్ కు ఎలా పరిచయమయ్యారనే విషయాల గురించి రకరకాల చర్చలు నడుస్తూ ఉంటాయి.

అయితే ఈ విషయాలలో ఎవరికి తోచిన కథ వారు చెప్పుకుంటూ వుంటారు. అసలు విషయానికొస్తే, ఈమె రష్యాకు చెందిన యువతి. 2011వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమా సమయంలో మొదటిసారి వీరి కలయిక జరిగింది. ఈ సినిమాలో ఆమె ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించిన సంగతి విదితమే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు కొంతకాలం పాటు సహజీవనం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులు ఇవ్వడంతో ఈమెను వివాహం చేసుకోవడం జరిగింది. అలా వీరి విహవాహం 2013 సెప్టెంబర్ 30వ తేదీ హైదరాబాద్ ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగింది.

ఈమధ్య జనసేన ప్రత్యర్ధులు అన్నాకి కూడా పవన్ విడాకులు ఇచ్చేసాడని, త్వరలో నాలుగో పెళ్లి కూడా చేసుకుంటాడని విషయం కక్కడం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో జనసేన ఆఫీసియల్ వెబ్ పేజిపైన పవన్ మరియు అన్నా కనిపించిన ఫోటో ఒకటి పోస్ట్ చేయడంతో ఓ వర్గం నోళ్లు మూసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు త్వరలో రిలీజుకి సిద్ధం అవుతున్నాయి. అందులో ఒకటి తమిళ దర్శకుడు రూపొందించిన ‘బ్రో’ సినిమా ఒకటి కాగా రెండవది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. కాగా ఈ రెండు సినిమాలకు సంబందించిన టీజర్స్ యూట్యూబ్ లో దుమ్ములేపిన సంగతి విదితమే.